కొర్జోవ్(పోలాండ్) : జాన్స్ కుసోన్సి స్మారక జావెలిన్ త్రో ఈవెంట్లో భారత గోల్డెన్ బాయ్ నీరజ్‌చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన పోటీలో నీరజ్ 84.14మీటర్లతో రెండో స్థానం దక్కగా, వెబర్ 86.12మీ టాప్‌లో నిలిచాడు.
నాటింగ్‌హామ్ : జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్ భారీ విజయంపై కన్నేసింది. జింబాబ్వే ఫాలోఆన్‌లో పడింది. శుక్రవారం జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 30/2 స్కోరు చేసింది. తొలుత జింబాబ్వే 265 పరుగులకే కుప్పకూలింది.