బర్మింగ్‌హామ్: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మెగాటోర్నీలో కచ్చితంగా పసిడి పతకం కొల్లగొడుతాడనుకున్న స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా…అనూహ్యంగా గాయంతో దూరమయ్యాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గాయపడ్డ నీరజ్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్నాడు. గత ఆదివారం జరిగిన ప్రపంచ టోర్నీలో రజత పతకంతో కొత్త చరిత్ర లిఖించిన ఈ యువ అథ్లెట్‌కు గజ్జల్లో గాయమైనట్లు తెలిసింది. ఎమ్ఆర్ఐ స్కానింగ్ తర్వాత నెల రోజుల పాటు నీరజ్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు భారత ఒలింపిక్ సమాఖ్య(ఐవోఏ) కార్యదర్శి రాజీవ్ మెహతా పేర్కొన్నారు. ‘భారత యువ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా..కామన్వెల్త్ గేమ్స్‌లో ప్రాతినిధ్యం వహించడం లేదంటూ ఈ రోజు(మంగళవారం) ఉదయం ఫోన్ చేశాడు.
గాయం చిన్నదైనా..ముందస్తు జాగ్రత్తగా విశ్రాంతి తీసుకోవాలన్నారు’ అని అన్నాడు. గత ఆదివారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్ సందర్భంగా తాను గాయపడ్డట్లు నీరజ్ చెప్పుకొచ్చాడు. నాలుగో ప్రయత్నంలో బరిసెను విసురుతున్న క్రమంలో గజ్జల్లో కండరాలు పట్టేసినట్లు పేర్కొన్నాడు. గాయం కారణంగా ప్రారంభ వేడుకల్లో ఫ్లాగ్ బేరర్‌గా నీరజ్ వ్యవహరించే అవకాశాలు కనిపించడం లేదు. అతడి గాయంపై నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెఫ్ డీ మిషన్ రాజేశ్ భండారీ పేర్కొన్నారు.