ఢిల్లీ: భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా తన కోచ్ జాన్ జెలెంజికి ఒక్క సీజన్‌కే గుడ్ బై చెప్పాడు. భారీ అంచనాలతో నీరజ్‌కు మార్గనిర్దేశనం చేసేందుకు 2024 నవంబర్‌లో అతడితో జతకలిసిన ఈ చెక్ దిగ్గజ అథ్లెట్.. మధ్యలోనే తప్పుకోవడం వెనుక కారణాలేంటో తెలియరాలేదు.
జెలెంజి కోచింగ్‌లోనే నీరజ్ తొలిసారిగా 90 మీటర్ల మార్కు (దోహా డైమండ్ లీగ్‌లో)ను అందుకున్నాడు. ఈ ఇద్దరూ పరస్పర అవగాహనతోనే విడిపోయినట్టు తమ సోషల్ మీడియా ఖాతాల్లో తెలిపారు.