ఒలింపిక్స్‌లో వందేళ్ల భారత కలను సాకారం చేస్తూ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా ప్రస్తుతం వెకేషన్ పీరియడ్‌లో ఉన్నాడు. మాల్దీవుల్లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఈ స్టార్ జావెలిన్ త్రోవర్ తాజాటా షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నీళ్లలో దిగి జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఉన్న ఈ వీడియోను షేర్ చేసిన నీరజ్, ’’ఆకాశంలో, నేలమీద, నీటిలో ఎక్కడైనా నేను జావెలిన్ గురించే ఆలోచిస్తా‘‘ అంటూ ట్వీట్ చేశాడు
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. ఇటీవల తన మాల్దీవుల ట్రిప్‌కు సంబంధించిన పలు ఫొటోలను నీరజ్ షేర్ చేశాడు. ఒలింపిక్స్‌లో నీరజ్ బంగారు పతకం గెలవడంతో దేశంలోని చాలా స్పోర్ట్స్ అకాడమీల్లో అభ్యర్థులు క్యూలు కడుతున్నారు. ఒక విధంగా నీరజ్ విజయంతో దేశంలో ’జావెలిన్ త్రో‘కు ఆదరణ విశేషంగా పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు.
Aasman par, zameen pe, ya underwater, I'm always thinking of the javelin!
— Neeraj Chopra (@Neeraj_chopra1) October 1, 2021
PS: Training shuru ho gayi hai 💪🏽 pic.twitter.com/q9aollKaJx