బ్రస్సెల్స్: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు (Neeraj Chopra) మరోసారి నిరాశే ఎదురయింది. జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. టైటిల్‌కు సెంటీ మీటర్ దూరంలో నిలిచిపోయాడు. బ్రస్సెల్స్ వేదికగా శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన తుదిపోరులో పారిస్ బ్రాంజ్ మెడలిస్ట్, గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్.. ఈటెను 87.87 మీటర్ల దూరం విసిరి చాంపియన్‌గా నిలిచాడు. తన మూడో ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నీరజ్.. 87.86 మీటర్ల దూరంతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. దీంతో అండర్సన్ కంటే 0.01 మీటర్లు మాత్రమే వెనుకబడ్డాడు. ఇక జర్మనీకి చెందిన జులియన్ వెబర్ 85.97 మీటర్లతో తర్వాతి స్థానంలో నిలిచాడు.
కాగా, గతేడాది కూడా డైమండ్ లీగ్‌లో నీరజ్ రెండో స్థానంలో నిలిచాడు. అప్పుడు ఈటెను 83.80 మీటర్ల దూరం విసిరాడు. 84.24 దూరం విసిరిన జాకుబ్ వాడ్లేజ్ (చెక్ రిపబ్లిక్) టైటిల్ గెలుచుకున్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లోనూ సెకండ్ ప్లేస్‌లో నిలిచిన చోప్రా రజతం గెలిచిన విషయం తెలిసిందే.
Neeraj Chopra hits 8⃣7⃣.8⃣6⃣ m and finishes second in Brussels 👏#DiamondLeagueonJioCinema #DiamondLeagueonSports18 #DiamondLeagueFinal pic.twitter.com/C8WETcMFqB
— JioCinema (@JioCinema) September 14, 2024