లాసాన్ : కామన్వెల్త్ గేమ్స్ తర్వాత భారత్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా, శ్రీలంక సంచలనం రుమేష్ పతిరాగే శుక్రవారం జరగనున్న లాసాన్ డైమండ్ లీగ్ మీట్లో మరోసారి ముఖాముఖి తలపడనున్నారు. గ్లాస్గో గేమ్స్‌లో పతిరాగే 89.75 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించగా, నీరజ్ 85.83 మీటరతో రజతం గెలిచాడు. ఈ సీజన్లో అద్భుత ఫామ్‌లో ఉన్న 23 ఏండ్ల్ల పతిరాగే రోమ్ డైమ్ండ లీగ్‌లో 92.62 మీటర్ల అత్యుత్తమ త్రోతో రాణించడంతో పాటు దోహా, రోమ్ మీట్లలో స్వర్ణాలు గెలిచాడు.
మరోవైపు గత ఏడాది సెప్టెంబర్ నుంచి గాయంతో బాధపడుతున్న 28 ఏండ్ల నీరజ్ తిరిగి తన పాత ఫామ్ అందుకోవడానికి శ్రమిస్తున్నాడు. సెప్టెంబర్ 4, 5న బ్రస్సెల్స్‌లో జరిగే డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా నీరజ్ ఈ టోర్నీలోకి దిగుతున్నాడు.