Neeraj Chopra : పారిస్ ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరోసారి సత్తా చాటాడు. వరుసగా రెండు విశ్వ క్రీడల్లో పతకాలు సాధించిన భారత ఈటె వీరుడు డైమండ్ లీగ్(Diamond League) ఫైనల్‌కు దూసుకెళ్లాడు. బ్రస్సెల్స్‌లో శుక్రవారం జరిగిన పోటీల్లో నీరజ్ 14 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. నెల క్రితం విశ్వక్రీడల్లో స్వర్ణం కొల్లగొట్టిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు.
ఒలింపిక్స్‌లో 89.45 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ టాప్ 6లో నిలిచాడు. అండర్సన్ పీటర్స్, జులియన్ వెబర్, జాకుబ్ వాద్లెజ్, చోప్రా, ఆండ్రియన్ మర్డరె, రోడెరిక్ జెన్కీ డీన్లు ఫైనల్‌కు అర్హత సాధించారు. శుక్రవారం జరిగిన పోటీల్లో అండర్సన్ పీటర్స్ 21 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే.. పారిస్‌లో 90 మీటర్ల దూరం ఈటెను విసిరిన నదీమ్ పేలవ ప్రదర్శనతో ఇంటిదారి పట్టాడు.
𝐍𝐞𝐞𝐫𝐚𝐣 𝐪𝐮𝐚𝐥𝐢𝐟𝐢𝐞𝐬 𝐟𝐨𝐫 𝐃𝐢𝐚𝐦𝐨𝐧𝐝 𝐋𝐞𝐚𝐠𝐮𝐞 𝐟𝐢𝐧𝐚𝐥𝐬! 💥💥
With 14 points Neeraj Chopra officially makes it into the Diamond League 2024 finals in Brussels slated 13-14 Sept. ✅📝#DiamondLeague #DiamondLeagueFinal pic.twitter.com/b1uWWDOdM0
— The Bridge (@the_bridge_in) September 6, 2024
పారిస్‌లో సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ కొన్ని రోజుల బ్రేక్ తీసుకుంటానని చెప్పాడు. గజ్జల్లోని కండరాల సమస్య(స్పోర్ట్స్ హెర్నియాలో ఒక రకం)తో బాధ పడుతున్న అతడు సర్జరీకి చేయించుకోవాలని అనకున్నాడు. అయితే.. ప్రస్తుతం గాయం తీవ్రత ఎక్కువ లేనందున చోప్రా సర్జరీ వాయిదా వేసుకున్నాడు.
అనంతరం లసానే డైమండ్ లీగ్‌లో నీరజ్ రెండో స్థానం దక్కించుకొని భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు. ‘ఈ సీజన్లో నేను ఇంకా ఒకటి లేదా రెండు పోటీల్లో పాల్గొంటాను. బహుశా బ్రస్సెల్స్ జరుగబోయే డైమండ్ లీగ్ ఫైనల్ చివరిది కావొచ్చు’ అని చోప్రా వెల్లడించాడు. సెప్టెంబర్ 13, 14వ తేదీల్లో డైమండ్ లీగ్ ఫైనల్ పోరు జరుగనుంది.