ఢిల్లీ: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు ఆర్మీలో లెఫ్ట్‌నెంట్ కర్నల్ హోదా దక్కింది. ఈ మేరకు బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. నీరజ్‌కు కర్నల్ హోదాను ప్రదానం చేశారు. 2016లో భారత ఆర్మీలో సుబేదార్‌గా చేరిన నీరజ్.. 2021లో మేజర్‌గా పదోన్నతి పొందాడు. తాజాగా అతడు మేజర్ నుంచి కర్నల్ హోదాను అందుకున్నాడు.