హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ వేదికగా ఈనెల 27 నుంచి జాతీయ సబ్‌జూనియర్ రోయింగ్ చాంపియన్‌షిప్ జరుగనుంది. హుస్సేన్‌సాగర్ 26వ జాతీయ సబ్‌జూనియర్ రోయింగ్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. ఇందులో 23 రాష్ర్టాల నుంచి దాదాపు 350 మంది ప్లేయర్లు పోటీపడబోతున్నారు.
అండర్-13, 15 వయసు విభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. టోర్నీకి సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం ఎల్బీ స్టేడియంలో సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి ఆవిష్కరించారు.