NOAC-2021: వరంగల్‌లో జాతీయ ఒపెన్ అథ్లెటిక్స్ ఛాంప్ పోటీలు
NOAC-2021 : వరంగల్‌లో రేపటి నుంచి 60 వ జాతీయ ఒపెన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగనున్నాయి. హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో ఈ పోటీలను...

హైదరాబాద్ : వరంగల్‌లో రేపటి నుంచి 60 వ జాతీయ ఒపెన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ (NOAC-2021) పోటీలు జరుగనున్నాయి. హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ పోటీలకు టోక్యో ఒలింపిక్స్ బంగారు పతక విజేత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా హాజరుకావడం లేదని సమాచారం. ఈ పోటీల కోసం హన్మకొండ జేఎన్ స్టేడియంలో దాదాపు రూ.7 కోట్లతో సింథటిక్ ట్రాక్‌ను ఏర్పాటుచేశారు. గత ఏడాది జూనియర్ నేషనల్స్తోపాటు నేషనల్ క్రాస్ కంట్రీ పోటీలను విజయవంతంగా నిర్వహించడంతో జాతీయ ఒపెన్ అథ్లెటిక్స్ ఛాంప్ పోటీలకు ఆతిథ్యమిచ్చే అవకాశం వరంగల్‌కు వచ్చింది. ఈ పోటీల నిర్వహణతో ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ కన్న కలలు నెరవేరనున్నాయి.
నీరజ్ చోప్రాతోపాటు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ద్యుతిచంద్, అవినాష్ సబ్లే, మురళి శ్రీశంకర్, కేటీ ఇర్ఫాన్ వంటి ప్రముఖ క్రీడాకారులు కూడా ఈ పోటీల్లో పాలుపంచుకోవడంలేదు. అలాగే, అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్‌లో లాంగ్ జంప్‌లో రజతం సాధించిన షాలినీ సింగ్, 10,000 మీ. లో వెండి సాధించిన అమిత్ ఖత్రి, 4×400 మీటర్ల రిలే టీమ్ భరత్ శ్రీధర్, ప్రియా మోహన్, సమ్మీ, కపిల్ కూడా గైర్హాజరవుతున్నారు. స్టార్ అథ్లెట్లు లేకపోవడంతో ఇతర యువ అథ్లెట్లకు వారి ప్రతిభను ప్రదర్శించే అవకాశం కలుగనున్నది. వచ్చే ఏడాదిలో జరిగే ఆసియా, కామన్వెల్త్ క్రీడలకు మెట్టుగా ఈ ఈవెంట్ ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. ఇక్కడ మంచి ప్రదర్శన చూపిన వారికి జాతీయ శిబిరంలో చోటు లభించే అవకాశాలు ఉంటాయి. వరంగల్ వంటి నగరంలో జాతీయ స్థాయి పోటీలు జరుగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని యువక్రీడాకారులకు మంచి ప్రోత్సాహం దొరుకుతుందని జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు అదిల్లే సుమారివాల్లా అభిప్రాయపడ్డారు. వరంగల్‌లో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నదని తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్టాన్లీ జోన్స్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
యూపీలో ఆప్ తిరంగా ర్యాలీ.. ఆలయాల సందర్శన
సీఎం యోగిపై బిహార్‌లో కేసు నమోదు
ఫిబ్రవరిలో ముచ్చింతల్‌లో ‘స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ’ విగ్రహావిష్కరణ
గాంధీ జయంతి కల్లా గాడ్సే విగ్రహం ప్రతిష్ట
ఎంపీ అర్జున్ సింగ్ నివాసం వద్ద మరో బాంబు పేలుడు
నీరజ్ జావెలిన్ కోచ్ ఉవే హూన్ తొలగింపు
బీఏలో ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ‘రామ్‌చరిత్‌మానస్’.. ఎక్కడంటే?
‘నీట్’గా రూ.35 లక్షలకు పేపర్ అమ్మాడు.. ఎక్కడంటే..?
నీలి రంగు జెర్సీలోకి మారిన ఆర్సీబీ.. ఎందుకంటే?
అధికార భాషగా హిందీకి 72 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

