e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home News AAP Tiranga Rally : యూపీలో ఆప్‌ తిరంగా ర్యాలీ.. ఆలయాల సందర్శన

AAP Tiranga Rally : యూపీలో ఆప్‌ తిరంగా ర్యాలీ.. ఆలయాల సందర్శన

లక్నో : ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల్లో బీజేపీని ఢీకొనేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ సన్నద్ధమైంది. బీజేపీ నకిలీ జాతీయత, నకిలీ రామరాజ్యం హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన తిరంగా ర్యాలీకి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ (AAP Tiranga Rally) చేపట్టింది. సోమవారం నాడు ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ఆలయాలను కూడా ఆప్‌ సీనియర్‌ నేతలు సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు.

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు తిరంగా యాత్రతో ఆమ్‌ ఆద్మీ పార్టీ శంఖారావం ఊదింది. మంగళవారం ఫైజాబాద్‌లో జాతీయత పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్‌ నేతృత్వం వహించారు. జాతీయ జెండాలను చేతబూని ఆప్‌ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ‘రామ జన్మభూమిని సందర్శించడంతోపాటు పలువురు సాధువులను కలిసే అవకాశం మాకు దక్కింది. ఇది మాకు ఎంతో భాగ్యం. ఆప్‌కు విజయం అందాలని వారు కోరుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఒకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుకున్నాం’ అని మనీష్‌ సిసోడియా మీడియాకు చెప్పారు. శ్రీరాముడి ఆశయాల మేరకు యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన పేర్కొన్నారు. యూపీలోని 403 స్థానాల్లో ఆప్‌ పోటీ చేస్తుందని అంతకుముందు ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ వెల్లడించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

- Advertisement -

సీఎం యోగిపై బిహార్‌లో కేసు నమోదు

ఫిబ్రవరిలో ముచ్చింతల్‌లో ‘స్టాచూ ఆఫ్‌ ఈక్వాలిటీ’ విగ్రహావిష్కరణ

గాంధీ జయంతి కల్లా గాడ్సే విగ్రహం ప్రతిష్ట

ఎంపీ అర్జున్‌ సింగ్‌ నివాసం వద్ద మరో బాంబు పేలుడు

నీరజ్‌ జావెలిన్‌ కోచ్‌ ఉవే హూన్‌ తొలగింపు

బీఏలో ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా ‘రామ్‌చరిత్‌మానస్‌’.. ఎక్కడంటే?

‘నీట్‌’గా రూ.35 లక్షలకు పేపర్‌ అమ్మాడు.. ఎక్కడంటే..?

నీలి రంగు జెర్సీలోకి మారిన ఆర్సీబీ.. ఎందుకంటే?

అధికార భాషగా హిందీకి 72 ఏండ్లు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana