Hindi Language : అధికార భాషగా హిందీకి 72 ఏండ్లు
Hindi Language : దేశవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ. కేంద్ర ప్రభుత్వం హిందీని అధికార భాషగా ప్రకటించి సరిగ్గా నేటికి 72 ఏండ్లు...

దేశవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ. కేంద్ర ప్రభుత్వం హిందీని అధికార భాషగా (Hindi Language) ప్రకటించి సరిగ్గా నేటికి 72 ఏండ్లు పూర్తయ్యాయి. ఏటా సెప్టెంబర్ 14 న హిందీ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం ప్రకటించింది. సంస్కృతం ప్రపంచంలోని తొలి భాషగా పరిగణిస్తుంటారు. అయితే, హిందీ 2550 ఏండ్ల క్రితం ప్రారంభమైనట్లుగా చెప్తుంటారు. 120 ఏండ్లుగా చాలా వేగంగా వ్యాప్తిచెందింది. ప్రపంచంలో అత్యంత అర్ధమయ్యే భాషగా మారింది.
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో అనేక పెద్ద సమస్యలు వచ్చాయి. వీటిలో భాషా సమస్య ఒకటి. భారతదేశంలో వందల భాషలు, మాండలికాలు మాట్లాడేవారు. అలాంటి పరిస్థితిలో అధికారిక భాషగా దేనిని నిర్ణయించాలనేది పెద్ద సవాలుగా ఉన్నది. సుదీర్ఘ చర్చ తర్వాత, రాజ్యాంగ పరిషత్ సెప్టెంబర్ 14 న హిందీని భారతదేశ అధికారిక భాషగా నిర్ణయించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 (1) లో పేర్కొన్నారు. దీని ప్రకారం, భారతదేశ అధికారిక భాష ‘హిందీ’ స్క్రిప్ట్ ‘దేవనాగరి’. 1953 నుంచి హిందీ ప్రచారం కోసం ఏటా సెప్టెంబర్ 14 న హిందీ దివాస్‌ను నిర్వహిస్తున్నారు.
అయితే, హిందీని అధికార భాషగా ఎంచుకున్న తర్వాత హిందీయేతర రాష్ట్రాల్లో నిరసనలు పెల్లుబికాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 1963 లో అధికారిక భాషా చట్టాన్ని తీసుకురావడంతో ఏ భాషలోనైనా అధికారిక పనులు చేసే హక్కు రాష్ట్రాలకు ఇవ్వబడింది. ప్రస్తుతం, దేశంలో 22 భాషలకు అధికారిక భాష హోదా లభించింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే మూడవ భాషగా హిందీ నిలిచింది. మన దేశంలో 77 శాతం మంది హిందీ మాట్లాడతారు. అర్థం చేసుకుంటారు. చదువుతారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2008: రష్యాలోని పెర్మ్ విమానాశ్రయంలో కూలిపోయిన ఏరోఫ్లోట్ 821, 88 మంది దుర్మరణం
2007: తనేగాషియాలోని ప్రయోగ కేంద్రం నుంచి తొలి చంద్ర ఉపగ్రహం హెచ్-2ఏ ను ప్రయోగించిన జపాన్
2006: న్యూక్లియర్ ఎనర్జీలో సహకారాన్ని పెంచడానికి ఐబీఎస్ఏలో అంగీకారం
2003: యూరోపియన్ యూనియన్‌లో చేరిన ఎస్టోనియా
2000: యూఎస్ సెనేట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి
2000: మైక్రోసాఫ్ట్ విండోస్ ఎంఈ ప్రారంభం
1998 : న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీలో 261 బిలియన్ డాలర్ల విలువతో అతిపెద్ద సంస్థగా అవతరించిన మైక్రోసాఫ్ట్
1960: ఒపెక్‌ను స్థాపించిన మినరల్ ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలు
1774 : మన దేశంలో సతీ దురాచారాన్ని రూపుమాపేందుకు కృషిచేసిన లార్డ్ బెంటిక్ జననం
ఇవి కూడా చదవండి..
బర్రెపై ఎక్కి వచ్చి నామినేషన్ దాఖలు.. ఎక్కడంటే..?
యాంటీఆక్సిడెంట్ మందుతో గుండెపోటు నివారించొచ్చు
ఆర్థిక రాజధాని టు దేశ రాజధాని.. లక్ష కోట్లతో ఎక్స్‌ప్రెస్‌వే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

