ఏటూరునాగారం,డిసెంబర్1: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి సీహెచ్ మసయ్య జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. మెదక్ జిల్లా పటాన్ చెరువులో గత నెల 28 నుంచి 30 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ విభాగం పోటీల్లో వరంగల్ జిల్లా తరపున పాల్గొని ప్రతిభ కనబర్చాడు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో త్వరలో జరిగే పోటీల్లో పాల్గొంటాడని ప్రధానోపాధ్యాయుడు ఈసం రమేశ్ తెలిపారు.