Nathan Lyon | 41 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన లియాన్.. భారత గడ్డపై అత్యధిక వికెట్లు అతనికే
ఆస్ట్రేలియా ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్ (Nathan Lyon) మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy)లో చెలరేగుతున్న అతను 41 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టాడు. భారత గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన విదేశీ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
Nathan Lyon : ఆస్ట్రేలియా (Australia) ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్ (Nathan Lyon) మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ (Border – Gavaskar Trophy)లో చెలరేగుతున్న అతను 41 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టాడు. భారత గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన విదేశీ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఆఫ్ స్పిన్నర్ భారత్‌లో 55 వికెట్లు పడగొట్టాడు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న టెస్టులో రెండో వికెట్ తీసిన అనంతరం లియాన్ ఈ మైలురాయికి చేరువయ్యాడు. ఇంతకుముందు ఈ రికార్డు డెరెక్ అండర్వుడ్ (ఇంగ్లండ్) పేరిట ఉంది. భారత గడ్డపై 16 టెస్టులు ఆడిన డెరెక్ 54 వికెట్లు తీశాడు.
లియాన్ 11 టెస్టుల్లోనే అతని రికార్డు బ్రేక్ చేయడం విశేషం. నాలుగో టెస్టులో శుభ్‌మన్ గిల్ (Shubaman Gill), కేఎస్ భరత్, అశ్విన్‌లను లియాన్ ఔట్ చేశాడు. ఇండోర్ టెస్టూలో లియాన్ 11 వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే.
విరాట్ కోహ్లీ సెంచరీ
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టు నాలుగో రోజు టీమిండియా జోరు కొనసాగించింది. విరాట్ కోహ్లీ (186) సెంచరీ, అక్షర్ పటేల్ (79) హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌట్ అయింది. 91 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. ఇంకా ఆ జట్టు 88 పరుగులు వెనబడి ఉంది. నైట్‌వాచ్‌మన్ మాథ్యూ కునేమాన్ (0), ట్రావిస్ హెడ్ (3) క్రీజులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
Anushka Sharma | ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా సెంచరీ కొట్టాడు.. ఇన్‌స్టాలో భర్త కోహ్లీని మెచ్చుకున్న అనుష్క శర్మ
IND vs AUS : కోహ్లీ సెంచరీ.. అక్షర్ పటేల్ ఫిఫ్టీ.. నాలుగో రోజు భారత్ జోరు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

