IND vs AUS : కోహ్లీ సెంచరీ.. అక్షర్ పటేల్ ఫిఫ్టీ.. నాలుగో రోజు భారత్ జోరు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy) ఆఖరి టెస్టు నాలుగో రోజు టీమిండియా జోరు కొనసాగించింది. విరాట్ కోహ్లీ (186) సెంచరీ, అక్షర్ పటేల్ (79) హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో భారీ స్కోర్ చేసింది. 571 పరుగులకు ఆలౌట్ అయింది. 91 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది.
IND vs AUS : భారత క్రికెట్ అభిమానుల మూడేళ్ల నిరీక్షణ ఆదివారం ఫలించింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాట్ నుంచి మరో సెంచరీ. అది కూడా టెస్టు ఫార్మాట్లో. గత ఏడాది ఫామ్ అందుకున్న కోహ్లీ టీ20లో, వన్డేలో (Border – Gavaskar Trophy)లో కచ్చితంగా మూడంకెల స్కోర్ చేరతాడని ఫ్యాన్స్ అంతా ఊహించారు. అనుకున్నట్టుగానే కీలకమైన అహ్మదాబాద్ టెస్టులో విరాట్ వంద కొట్టాడు. 23 మ్యాచ్‌లు..1,204 రోజుల తర్వాత.. ఓపికగా ఆడిన అతను టెస్టుల్లో 28వ శతకం, అంతర్జాతీయంగా 75వ శతకం నమోదు చేశాడు. అంతేకాదు ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ రిజిష్టర్ చేశాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (Border – Gavaskar Trophy) ఆఖరి టెస్టు నాలుగో రోజు టీమిండియా జోరు కొనసాగించింది. విరాట్ కోహ్లీ (186) సెంచరీ, అక్షర్ పటేల్ (79) హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో భారీ స్కోర్ చేసింది. 571 పరుగులకు ఆలౌట్ అయింది. 91 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. ఇంకా ఆ జట్టు 88 పరుగులు వెనబడి ఉంది. నైట్‌వాచ్‌మన్ మాథ్యూ కునేమాన్ (0), ట్రావిస్ హెడ్ (3) క్రీజులో ఉన్నారు. ఐదో రోజు ఆట కీలకం కానుంది. ఈ మ్యాచ్ గెలవాలంటే భారత స్పిన్నర్లు చెలరేగి పర్యాటక ఆసీస్‌ను వంద, నూటయాభై లోపే ఆలౌట్ చేయాల్సి ఉంటుంది.
కోహ్లీ క్లాస్ ఆటతో..
ఓవర్‌నైట్ స్కోర్ 289జ3 తో నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత్ 309 రన్స్ వద్ద జడేజా వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో వికెట్ తీసేందుకు ఆసీస్ బౌలర్లు అపసోపాలు పడ్డారు. విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ ఐదో వికెట్‌కు 84 రన్స్ చేశారు. కోహ్లీ ఈ మ్యాచ్‌లో తన క్లాస్ ఆటతో ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అక్షర్ పటేల్‌తో 162 పరుగులు జోడించాడు. వీళ్లిద్దరూ భారత్‌కు లీడ్ వచ్చేంత వరకు నిదానంగా ఆడారు. ఆ తర్వాత దూకుడు పెంచారు. మూడు, నాలుగు, ఐదో వికెట్‌కు విలువైన పరుగులు జోడించిన కోహ్లీ 241 బంతుల్లో సెంచరీ కొట్టాడు. దాంతో, అంతర్జాతీయంగా 75వ శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అతను 150 రన్స్ దాటాక,. డబుల్ సెంచరీ చేస్తాడని అనుకున్నారంతా. కానీ, ఆసీస్ బౌలర్లు పుంజుకొని వికెట్లు తీశారు. మర్ఫీ ఓవర్లో కోహ్లీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు.
బ్రేక్ ఇచ్చిన స్టార్క్
కోహ్లీ, అక్షర్ పటేల్ క్రీజులో ఉండడంతో.. భారత్ 150 లీడ్ సాధించేలా కనిపించింది. కానీ, ఆఖరి సెషన్లో వెంట వెంటనే మూడు వికెట్లు పడ్డాయి. అక్షర్ పటేల్ (79) ఔట్ కావడంతో టీమిండియా 556 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ ఓవర్లో అక్షర్ బౌల్డ్ అయ్యాడు. దాంతో, అసీస్‌కు బ్రేక్ లభించింది. కోహ్లీతో జత కలిసిన అక్షర్ మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లిద్దరూ ఆరో వికెట్‌కు 162 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (7) లియాన్ ఓవర్లో షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. రెండో రన్ కోసం ప్రయత్నించి ఉమేష్ యాదవ్ (0) రనౌట్ అయ్యాడు. పీటర్ హ్యాండ్స్కాంబ్ త్రో చేయడంతో మర్ఫీ వికెట్లను గిరాటేశాడు. దాంతో, 569 వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.
ఇవి కూడా చదవండి
Neymar | బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్‌కు సర్జరీ.. 4 నెలలు ఆటకు దూరం
Sunil Gavaskar | అతను ఈజీగా టెస్టుల్లో 10వేల పరుగులు చేస్తాడు : గవాస్కర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

