Neymar | బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్‌కు సర్జరీ.. 4 నెలలు ఆటకు దూరం
బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ (Brazil footballer), పీఎస్జీ (PSG) క్లబ్ ఫార్వర్డ్ ప్లేయర్ నెయ్మర్ (Neymar) కుడికాలు చీలమండ(ankle)కు సర్జరీ చేయించుకున్నాడు. ఖతర్‌లోని అస్పెతార్ ఆస్పత్రి వైద్యులు అతడికి విజయవంతంగా సర్జరీ చేశారు.
Neymar : బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ (Brazil footballer), పీఎస్జీ (PSG) క్లబ్ ఫార్వర్డ్ ప్లేయర్ నెయ్మర్ (Neymar) కుడికాలు చీలమండ(ankle)కు సర్జరీ చేయించుకున్నాడు. ఖతర్‌లోని అస్పెతార్ ఆస్పత్రి వైద్యులు అతడికి విజయవంతంగా సర్జరీ చేశారు. ‘నెయ్మర్కు చీలమండకు సర్జరీ సక్సెస్ అయింది. దాంతో, ఇకనుంచి అతను తరచూ చీలమండ గాయంతో బాధ పడడం అనేది జరగదు’ అని హాస్పిటల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్పత్రి మంచం మీద ఉన్న ఫొటోను ఆన్లైన్లో షేర్ చేశారు.
‘నెయ్మర్ జూనియర్‌కు శుక్రవారం చీలమండ(ankle)కు సర్జరీ జరిగింది. దాంతో అతను నాలుగు నెలలు ఆటకు దూరం కానున్నాడు. పీఎస్జీ ఈ సీజన్ మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ప్రస్తుతం నెయ్మర్ చాలా సంతోషంగా ఉన్నాడు. అతనికి ఏమాత్రం నొప్పి లేదు. అతడికి సర్జరీ చేసిన వైద్యులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు’ అని పీఎస్జీ మెడికల్ డైరెక్టర్ హకీం చలాబీ తెలిపాడు.
ఫిఫా వరల్డ్ కప్‌లో..
మైదానంలో చిరుతలా కదిలే నెయ్మర్ నాలుగు నెలల నుంచి మోకాలి గాయంతో బాధ పడుతున్నాడు. నొప్పితోనే అతను దుబాయ్‌లో అల్నస్రీ క్లబ్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాడు. అయితే.. గాయం మరింత వేధిస్తుండడంతో అతను దుబాయ్‌లో సర్జరీ చేసుకోవాలి అనుకున్నాడు. గత ఏడాది ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో నెయ్మార్ గాయం కారణంగా నాకౌట్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బ్రెజిల్ నాకౌట్ రౌండ్లో క్రొయేషియా చేతిలో ఓటమి పాలైంది.
ఇవి కూడా చదవండి
DC vs GG | షఫాలీ వర్మ సుడిగాలి ఇన్నింగ్స్.. గుజరాత్‌పై 10 వికెట్లతో ఢిల్లీ భారీ విజయం
Rohit Sharma | రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత.. 17 వేల పరుగుల క్లబ్లో చోటు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

