Natasa Stankovic | భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardhi Pandya), నటాషా స్టాంకోవిక్ (Natasha Stankovic)లు విడిపోయి దాదాపు రెండు నెలలు కావోస్తోంది. అన్యోన్యంగా నాలుగేండ్లకు పైగా సాగిన తమ ప్రేమ ప్రయాణానికి ఈ జంట అర్ధంతరంగా ముగింపు పలికింది. ఇక డివోర్స్ తర్వాత ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్‌తో విడిపోయిన తర్వాత నటాషా తొలిసారి ప్రేమ గురించి ఓ పోస్ట్ పెట్టారు. ప్రేమకు నిజమైన అర్థాన్ని వివరించే పోస్ట్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. నిజమైన ప్రేమ ఎప్పటికీ విఫలం కాదని (True love never fails) పేర్కొన్నారు. ప్రేమ.. సహనం, దయగలదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
పరస్పర ఒప్పందంతో..
టీ 20 వరల్డ్ కప్ హీరోగా స్వదేశం వచ్చిన పాండ్యా వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అందరూ ఊహించినట్టుగానే భార్య నటాషాతో తెగతెంపులు చేసుకున్నాడు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా నటాషాతో విడాకులు ప్రకటించాడు. ‘నాలుగేండ్ల దాంపత్య జీవితం తర్వాత పరస్పర ఒప్పందంతో నటాషా, నేను విడాకులకు సిద్ధమయ్యాం. కలిసి బతికేందుకు ఎంతో ప్రయత్నించాం. కానీ, కుదరలేదు.
దాంతో, ఇద్దరి ప్రయోజనాల మేరకు విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకు పుట్టిన అగస్త్య ఇక ముందు కూడా మా ఇద్దరి ప్రేమను పొందనున్నాడు. కో పేరెంట్‌గా అతడికి అన్ని సమకూర్చడమే కాకుండా, అతడిని సంతోషంగా ఉంచుతాం. ఈ కష్ట సమయంలో మా గోప్యతకు భంగం కలిగించ వద్దని అభిమానులను కోరుతున్నా’ అని పాండ్యా వెల్లడించాడు.
Natasha 2
రెండు సార్లు పెళ్లి..
మోడల్ అయిన నటాషాతో పాండ్యాకు 2020 మార్చి 31న వివాహమైంది. అది కరోనా టైమ్ కావడంతో సాదాసీదాగా వీళ్లిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అతికొద్ది మంది సమక్షంలో కోర్టులో హార్దిక్, నటాషాల పెళ్లి జరిగింది. అయితే, తమ పెళ్లిని అందమైన జ్ఞాపకంలా మలచుకోవాలని భావించిన ఈ ప్రేమ జంట.. పరిస్థితులు చక్కబడ్డాక బంధు, మిత్రుల సమక్షంలో వైభవంగా పెళ్లి చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ఫ్రిబవరిలో ప్రేమికుల దినోత్సవం రోజున ఉదయ్‌పూర్‌లో కన్నుల పండువగా రెండోసారి వివాహం చేసుకున్నారు. కుమారుడు అగస్త్యను ఎత్తుకొని మురిసిపోతూ ఫొటోలు దిగారు. అనుకున్నట్టుగానే తమ పెళ్లిని అందమైన జ్ఞాపకంగా మలచుకుని.. ఏడాదిలోపే విడాకులు తీసుకున్నారు.
Also Read..
MLC Kavita | ఎమ్మెల్సీ కవితకు బెయిల్.. మంజూరు చేసిన సుప్రీంకోర్టు
Maharashtra | కోల్‌కతా ఘటన మరవకముందే.. నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యం