కొత్తపల్లి, జనవరి 12 : ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన జాతీయ ఖోఖో క్రీడాకారుడు, దక్షిణ మధ్య రైల్వే కోచ్ ఇస్లావత్ నరేశ్ భారత మహిళల ఖోఖో జట్టుకు కోచ్గా ఎంపికయ్యాడు. సోమవారం (జనవరి 13) నుంచి ఢిల్లీలో జరుగబోయే మొదటి ఖోఖో ప్రపంచకప్ పోటీలలో పాల్గొనబోయే భారత మహిళల జట్టుకు అతడు కోచ్గా విధులు నిర్వర్తించనున్నాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం బంజరుపల్లి తండాకు చెందిన నరేశ్.. జాతీయ జట్టుకు కోచ్గా ఎంపికవడంతో ఆయనను రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అభినందించారు.