Mohsin Naqvi | భారత్ కూడా ఓడిందిగా.. ఒక్కరాత్రిలో ఎవరూ ఛాంపియన్ కాలేరు..!
Mohsin Naqvi : ఇంగ్లండ్ గడ్డపై చతికిలపడుతున్న పాకిస్థాన్(Pakistan) జట్టుకు మద్దతు లభించింది. వరసగా రెండు టెస్టులో ఘోర ఓటమిపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) తమ టీమ్‌కు బాసటగా నిలాచాడు.
Mohsin Naqvi : ఇంగ్లండ్ గడ్డపై చతికిలపడుతున్న పాకిస్థాన్ (Pakistan) జట్టుకు మద్దతు లభించింది. వరసగా రెండు టెస్టులో ఘోర ఓటమిపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) తమ టీమ్‌కు బాసటగా నిలాచాడు. సిరీస్ పరాజయంతో పాక్ పని అయిపోలేదని పేర్కొన్న నఖ్వీ ఈ సందర్భంగా భారత జట్టు పేరును ప్రస్తావించాడు. మేటి జట్టైన టీమిండియా ఇటీవల చిన్న జట్టు చేతిలో ఓడింది. అలాగనీ వాళ్ల క్రికెట్ ఆగిపోలేదుగా అని విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు పీసీబీ చీఫ్.
లార్డ్స్ టెస్టులో ఓటమి.. స్క్వాడ్ నుంచి ఏడుగురిని తప్పిండం వంటి పరిణామాలు పాకిస్థాన్ క్రికెట్లో దుమారం రేపాయి. సెలెక్టర్ కమిటలోని మాజీ ఆటగాడు మిస్బాహుల్ హక్ రాజీనామా చేశాడు. మొహ్సిన్ నఖ్వీ నేతృత్వంలోని బోర్డు చెత్త నిర్ణయాలతోనే పాక్ జట్టు ఆట అధ్వాన్నంగా మారిందనే విమర్శలు జోరందుకున్నాయి. దాంతో.. తనను, పాక్ టీమ్‌ను లక్ష్యంగా చేసుకున్నవాళ్లకు నఖ్వీ కౌంటర్ ఇచ్చాడు.
Mohsin Naqvi 🗣️
“India lost to Ireland and South Africa lost to Namibia. That doesn’t mean their cricket is finished. Pakistan has improved its rankings in T20Is and ODIs.”
My only question to him: Which ICC trophy has Pakistan won recently? 🤔
India won 3 white-ball ICC…
— Rajvir (@Rajvir1881) September 3, 2026
‘ఇటీవల పెద్ద జట్లు కూడా ఓడిపోయాయి. ఐర్లాండ్ చేతిలో టీమిండియా, నమీబియా చేతిలో దక్షిణాఫ్రికా జట్లు పరాజయం చవిచూశాయి. అంతమాత్రాన వాళ్ల క్రికెట్ ముగియలేదు కదా. ఒక్కరాత్రిలోనే ఏ జట్టు కూడా ఛాంపియన్ కాలేదు. ఈమధ్య కాలంలో పాకిస్థాన్ జట్టు చాలా మెరుగైంది. టీ20 ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉండే పాక్ ఇప్పుడు ఆరో ర్యాంక్‌లో కొనసాగుతోంది. వన్డేల్లో ఎనిమిదో స్థానం నుంచి ఐదో ర్యాంక్‌కు ఎగబాకింది. కాబట్టి నేను విమర్శలకు భయపడను. ముఖ్యంగా జీవితంలో ఏమీ సాధించనివారి మాటల్ని నేను అస్సలు పట్టించుకోను. అయితే.. ఇంగ్లండ్‌పై పాక్ జట్టు ప్రదర్శన పట్ల నేనూ నిరాశచెందాను. కానీ, నేను పీసీబీ అధ్యక్షుడిగా సరిగ్గా పనిచేయడం లేదని అంటున్నవాళ్లకు ఏమీ తెలియదు’ అని నఖ్వీ పేర్కొన్నాడు.
PCB Chairman Mohsin Naqvi defended Pakistan’s progress, pointing to South Africa’s loss to Namibia and India’s defeat to Ireland while noting that Pakistan have climbed from ninth to sixth in T20Is and eighth to fifth in ODIs. 🏏🇵🇰
Do you think Pakistan cricket is going in the… pic.twitter.com/qeKpSgumPJ
— TOK Sports (@TOKSports021) September 3, 2026
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రవర్తనతో వార్తల్లో నిలిచే మొహ్సిన్ నఖ్వీ 2024 ఫిబ్రవరి 6వ తేదీన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడయ్యాడు. అతడు ఏమంట ఈ పదవి చేపట్టాడో.. దాయాది జట్టు ఆటలో దూకుడు, విజయకాంక్ష తగ్గింది. గత రెండేళ్ల కాలంలో పాకిస్థాన్ ఆట గాడి తప్పింది. భారత్, శ్రీలంక ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్‌కప్‌లో పాక్ గ్రూప్ దశలోనూ నిష్క్రమించింది. ఆపై.. బంగ్లాదేశ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడి.. టెస్టు సిరీస్ కోల్పోయింది.
ఇది చాలదన్నట్టు.. ర్యాంకింగ్స్‌లోనూ పాక్ దిగజారింది. అసలే పతనం అంచున ఉన్న పాక్ క్రికెట్‌కు.. ఇంగ్లండ్ పర్యటనలో సిరీస్ ఓటమి పుండు మీద కారం చల్లినట్టైంది. బ్యాటర్ల వైఫల్యంతో వరసగా రెండు టెస్టుల్లో ఓడిన పాక్ సిరీస్ కోల్పోయింది. నామమాత్రమైన మూడో మ్యాచ్ సెప్టెంబర్ 9 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి వైట్‌వాష్ తప్పించుకోవాలని పాక్ భావిస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

