Bandi Nandini | అమ్రాబాద్, ఏప్రిల్ 10: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల ప్రాంతం పదర గ్రామానికి చెందిన బండి నందిని భారత కబడ్డీ జట్టుకు ఎంపికైంది.
సబ్‌జూనియర్ యూత్ ఏషియన్ కబడ్డీ టీమ్ ప్రాబబుల్స్‌లో నందిని చోటు దక్కించుకుందని జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు గురువారం పేర్కొన్నారు. జాతీయ కబడ్డీ జట్టుకు నందిని ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.