Unofficial Test | నబీకి నాలుగు వికెట్లు.. భారత్-Aకు స్వల్ప ఆధిక్యం..!
Unofficial Test : మొదటి అనధికారిక టెస్టులో భారత ఏ బౌలర్ల ధాటికి రోజున్నరకే శ్రీలంక ఏ ఆలౌటైంది. దాంతో, భారత ఏ జట్టుకు 160 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
Unofficial Test : మొదటి అనధికారిక టెస్టులో భారత ఏ బౌలర్ల ధాటికి రోజున్నరకే శ్రీలంక ఏ ఆలౌటైంది. అకీబ్ నబీ దార్(4-58) పేస్‌ను ఎదుర్కోలేక ఆతిథ్య జట్టు బ్యాటర్లు తోకముడవగా.. 330 రన్స్‌కే కుప్పకూలింది. దాంతో, భారత ఏ జట్టుకు 160 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమిండియాకు శుభారంభమివ్వాలనుకున్న ఓపెనర్ సాయి సుదర్శన్(7) రిటైర్డ్ హర్టయ్యాడు. ప్రస్తుతం ఆయుష్ పాండే, దేవ్‌దత్ పడిక్కల్ ఆడుతున్నారు.
గాలే స్టేడియంలో జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టులో భారత ఏ పట్టుబిగించింది. రంజీ వీరుడు అకీబ్ నబీ(4-58) బంతితో విజృంభించగా మూడోరోజే శ్రీలంక ఏ కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోర్ 113/2తో ఇన్నింగ్స్ మొదలెట్టిన లంకను యశ్ ఠాకూర్(2-51) దెబ్బకొట్టాడు. అర్ధశతకంతో విసిగించిన నువనిందు ఫెర్నాండో(84)ను ఔట్ చేసిన ఠాకూర్ వికెట్ల వేటకు తెరతీశాడు. అంజల బండార(70)ను వెనక్కి పంపిన నబీ.. లోయర్ ఆర్డర్‌ను పడగొట్టాడు. నబీ ధాటికి శ్రీలంక ఏ 330 పరుగులకే ఆలౌటైంది.
Auqib Nabi starred with a brilliant four-wicket haul as India A secured a commanding 122-run first-innings lead over Sri Lanka A.#TeamIndia #AuqibNabi #INDvsSL #Cricket pic.twitter.com/5JaoVs16OF
— InsideSport (@InsideSportIND) June 27, 2026
సాయి, జురెల్ సెంచరీ..
ఓపెనర్ సాయి సుదర్శన్(132), ఆయుష్ పాండే(25)లు భారత ఏ జట్టుకు శుభారంభమిచ్చారు. తొలి వికెట్‌కు 92 రన్స్ జోడించిన సాయి.. ఆ తర్వాత దేవ్‌దత్ పడిక్కల్(12), రుతురాజ్ గైక్వాడ్(22)లతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. షేక్ రషీద్(63), ధ్రువ్ జురెల్(141 నాటౌట్) మెరవగా.. తొలి రోజే 4 వికెట్ల నష్టానికి 333 రన్స్ కొట్టిన భారత్.. రెండో రోజూ జోరు చూపింది.
ధ్రువ్ జురెల్(141 నాటౌట్)

రషీద్‌తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన జురెల్ రెండో రోజు లంక బౌలర్లను పరీక్షించాడు. హర్ష్ దూబే(30)తో కలిసి స్కోర్ నాలుగొందలు దాటించాడు. దూబేను గుణశేఖర( 3-84) ఔట్ చేశాక 452-6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది భారత ఏ.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

