IPL 2025 : ప్లే ఆప్స్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (Mustafizur Rahman) త్వరలోనే స్క్వాడ్‌తో కలువనున్నాడు. ఎట్టకేలకు అతడికి ఆ దేశ బోర్డు అతడికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ఇచ్చింది. దాంతో, ఈ స్పీడ్‌స్టర్ ఐపీఎల్ ఆడేందుకు భారత్‌కు విచ్చేస్తున్నాడు. అయితే.. వారం రోజులు మాత్రమే ముస్తాఫిజుర్ అందుబాటులో ఉంటాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. అంటే మే 18 నుంచి 24వ తేదీ వరకు జరిగే లీగ్ మ్యాచులకు మాత్రమే అతడికి అనుమతి ఇచ్చినట్టు బీసీసీఐకి వివరించింది.
ముక్కోణపు టీ20 సిరీస్ కోసం ముస్తాఫిజుర్ బంగ్లాదేశ్ జట్టుతో పాటు యునైటెడ్ అరమ్ ఎమిరేట్స్(UAE)లో ఉన్నాడు. యూఏఈ, పాకిస్థాన్, బంగ్లా మధ్య మే 17 నుంచి ఈ సిరీస్ జరుగనుంది. దాంతో, ముస్తాఫిజుర్‌కు బోర్డు ఎన్ఓసీ ఇస్తుందా? లేదా? అనే సందేహంలో ఉంది ఢిల్లీ యాజమాన్యం అయితే.. బీసీసీఐతో మాట్లాడించి బంగ్లా క్రికెట్ పెద్దలను ఒప్పించింది.
Bangladesh have granted Mustafizur Rahman a No Objection Certificate to play for Delhi Capitals from May 18-24.
He will travel to India after Bangladesh’s 1st T20I against the UAE and will be available for DC’s three remaining league stage matches.
🔗 https://t.co/1ajBwXJoA3 pic.twitter.com/RPllcsrrnO
— ESPNcricinfo (@ESPNcricinfo) May 16, 2025
‘ఐపీఎల్ 18వ సీజన్ తదుపరి మ్యాచుల్లో ఆడేందుకు ముస్తాఫిజుర్‌కు ఎన్వోసీ ఇచ్చాం. అతడు మే 18 నుంచి మే 24 వరకూ ఐపీఎల్ ఆడుతాడు. మే 17న యూఏతో టీ20 మ్యాచ్ పూర్తయ్యాక.. అతడు భారత్‌కు బయల్దేరుతాడు’ అని శుక్రవారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
యువ హిట్టర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (Jake Fraser McGurk) తదుపరి మ్యాచ్‌లకు దూరం కావడంతో ముస్తాఫిజుర్ రెహ్మాన్‌తో ఢిల్లీ ఫ్రాంచైజీ ఒప్పందం చేసుకుంది. కీలకమైన లీగ్ మ్యాచ్‌లకు మిచెల్ స్టార్క్ అందుబాటులో లేకపోవడంతో ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఢిల్లీ బౌలింగ్ యూనిట్‌కు బలంగా మారనున్నాడు. ముస్తాఫిజుర్ 2016లో ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడాడు.
Mustafizur Rahman is back in 💙❤️ after two years!
He replaces Jake Fraser-McGurk who is unavailable for the rest of the season. pic.twitter.com/gwJ1KHyTCH
— Delhi Capitals (@DelhiCapitals) May 14, 2025
2022, 2023 సీజన్లలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన అతడు 8 మ్యాచుల్లో 7.62 ఎకానమీతో 8 వికెట్లు తీశాడు. అంతకుముందు సీఎస్కే, సన్‌రైజర్స్ జట్లకు కు కూడా ఆడిన అనుభవం ముస్తాఫిజుర్‌కు ఉంది. ఐపీఎల్లో మొత్తంగా ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ 38 మ్యాచులు ఆడి.. 38 వికెట్లు పడగొట్టాడు.