Final Destination Bloodlines | ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న హాలీవుడ్ మూవీ.. తొలిరోజు వసూళ్లు ఇవే.!
Bloodlines | హాలీవుడ్ హర్రర్ ఫిల్మ్ ఫ్రాంచైజీ 'ఫైనల్ డెస్టినేషన్' నుంచి వచ్చిన తాజా చిత్రం 'బ్లడ్‌లైన్స్' ఇండియాలో విడుదలైన మొదటి రోజే భారీ వసూళ్లను రాబడుతుంది.
Final Destination Bloodlines | హాలీవుడ్ హర్రర్ ఫిల్మ్ ఫ్రాంచైజీ ‘ఫైనల్ డెస్టినేషన్’ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘బ్లడ్‌లైన్స్’ ఇండియాలో విడుదలైన మొదటి రోజే భారీ వసూళ్లను రాబడుతుంది. మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలిరోజు ఏకంగా రూ. 5.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. దీంతో ఇండియాలో హాలీవుడ్ హర్రర్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఇది నాలుగో స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో ‘ది కాంజురింగ్’ సిరీస్ సినిమాలు టాప్-3లో ఉన్నాయి. ‘ది నన్’ చిత్రం రూ. 10.80 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, ‘ది కాంజురింగ్ 2’ రూ. 7 కోట్లు, ‘అన్నాబెల్లే: క్రియేషన్’ రూ. 6 కోట్లతో ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఇండియాలో ‘ఫైనల్ డెస్టినేషన్’ సిరీస్‌కు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. 2011లో విడుదలైన ‘ఫైనల్ డెస్టినేషన్ 5’ ఇండియాలో కేవలం రూ. 7.65 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే ‘బ్లడ్‌లైన్స్’ విడుదలైన రెండు రోజుల్లోనే ఈ ఫ్రాంచైజీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవనుందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు.
మొదటి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ సినిమా రాబోయే రోజుల్లో మరింత మంచి కలెక్షన్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మే 17న విడుదల కానున్న టామ్ క్రూజ్ నటించిన భారీ చిత్రం ‘మిషన్: ఇంపాజిబుల్ – డెడ్ రెకనింగ్’ నుంచి దీనికి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈ చిత్రానికి ఆడమ్ స్టెయిన్ & జాక్ లిపోవ్స్కీ సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. బుసిక్ & లోరి ఎవాన్స్ టేలర్ స్క్రీన్ ప్లే అందించారు. కైట్లిన్ శాంటా జువానా, టెయో బ్రియోన్స్, రిచర్డ్ హార్మన్, ఓవెన్ పాట్రిక్ జాయ్నర్, అన్నా లోరే ముఖ్య పాత్రల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

