Timed Out | బంగ్లా – లంకల ‘టైమ్డ్ ఔట్’ రివేంజ్ ఇప్పట్లో ముగిసేలా లేదుగా..! మళ్లీ గెలికిన ముష్ఫీకర్
BAN vs SL Timed Out Revenge | కొద్దిరోజుల క్రితమే ఈ రెండు జట్ల మధ్య ముగిసిన టీ20 సిరీస్‌లో లంక 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్నాక లంకేయులు తమ చేతికున్న వాచీలను చూపిస్తూ బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ట్రోల్ చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ వంతు వచ్చింది.
BAN vs SL Timed Out Revenge | అప్పుడెప్పుడో వన్డే వరల్డ్ కప్ (2023)లో బంగ్లాదేశ్ – శ్రీలంకల మధ్య జరిగిన మ్యాచ్‌లో లంక మిడిలార్డర్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’గా ఔట్ అయిన వివాదాన్ని ఈ ఇరుదేశాలు ఇప్పట్లో మరిచేలా లేవు. మ్యాచ్ ఆడేప్పుడు ఇరు జట్ల మధ్య భావావేశాలు పీక్స్‌లో ఉంటుండగా గెలిచిన జట్టు ట్రోఫీ అందుకునే సందర్భంలో కూడా ఒక జట్టుపై మరో జట్టు ‘టైమ్డ్ ఔట్’ రివేంజ్ తీర్చుకుంటున్నాయి. ఇటీవలే టీ20లలో బంగ్లాను ఓడించిన లంకేయులు.. ట్రోఫీ నెగ్గాక తమ చేతికున్న వాచీలు చూపిస్తూ ఆ జట్టును ట్రోల్ చేయగా తాజాగా బంగ్లా పులులు.. మాథ్యూస్‌తో పాటు లంకనూ ఆటాడుకున్నాయి.
శ్రీలంకతో ముగిసిన మూడో వన్డేలో గెలిచి (2-1 తేడాతో బంగ్లాదే వన్డే సిరీస్) ట్రోఫీ అందుకున్నాక బంగ్లా వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్.. తన హెల్మెట్‌ను పట్టుకుని వచ్చి దానిని తలకు పెట్టుకోలేక కంగారు పడుతుంటాడు. ఆ తర్వాత ఏమైంది..? అన్నట్టుగా ఆదరాబాదరగా అక్కడ్నుంచి వెనుదిరుగుతాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో మాథ్యూస్ కూడా తన హెల్మెట్ మరిచిపోయి వచ్చాక షకిబ్ అల్ హసన్ ఔట్ అప్పీల్ చేయడంతో ఇలాగే బిత్తరచూపులు చూశాడు. ముష్ఫీకర్ ఇప్పుడు అదే రిపీట్ చేసి మాథ్యూస్‌తో పాటు లంకనూ ట్రోల్ చేశాడు.
During World Cup, Mathews was timed out vs Bangladesh due to helmet issue
After T20I series, Sri Lanka celebrated the win with a timed-out gesture
After ODI series, Mushfiqur brought his helmet to celebrate the win
THIS RIVALRY 🇧🇩🇱🇰🔥🔥 #BANvSL pic.twitter.com/EWQf6Wgz2g
— Farid Khan (@_FaridKhan) March 18, 2024
కాగా కొద్దిరోజుల క్రితమే ఈ రెండు జట్ల మధ్య ముగిసిన టీ20 సిరీస్‌లో లంక 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్నాక లంకేయులు తమ చేతికున్న వాచీలను చూపిస్తూ బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ట్రోల్ చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ వంతు వచ్చింది. ఈ రెండు జట్ల వైరానికి ఇప్పటికే ‘నాగిని రైవల్రీ’ అని పేరుపెట్టుకున్న నెటిజన్లు.. రెండు జట్ల రివేంజ్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Dutch-Bangla Bank Bangladesh 🆚 Sri Lanka ODI Series 2024 | 3rd ODI 🏏
Match Result | Bangladesh won by 4 Wickets
Details 👉: https://t.co/8QnMRSHAtg#BCB #Cricket #BANvSL #BDCricket #LiveCrcket #Bangladesh #HomeSeries #odiseries pic.twitter.com/GqIRYkpfnD
— Bangladesh Cricket (@BCBtigers) March 18, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

