రావాల్పిండి: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికుర్ రహిమ్(Mushfiqur Rahim ) సెంచరీచేశాడు. టెస్టుల్లో అతనికి 11వ సెంచరీ కాగా, నాలుగో రోజు బంగ్లాదేశ్ ఆధిక్యాన్ని సాధించింది. తాజా వార్తలు అందేసరికి.. బంగ్లా ఆరు వికెట్ల నష్టానికి 472 రన్స్ చేసింది. రహిమ్ 152 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు. మరో బ్యాటర్ హసన్ రాజా 48 రన్స్‌తో ఆడుతున్నాడు. పాకిస్థాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 448 రన్స్‌కు డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. పాక్ పేస్ బౌలర్లను రహిమ్ ధీటుగా ఎదుర్కొన్నాడు.