Rishabh – Musheer : దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ..భావితారగా ప్రశంసలు అందుకుంటున్న యువ ఆటగాడు ముషీర్ ఖాన్ (Musheer Khan) జోరుకు బ్రేక్ పడింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో గొప్పగా రాణిస్తున్న అతడు ఇరానీ కప్(Irani Cup 2024) ముందు కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. లక్నో సమీపంలో ముషీర్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఈ ప్రమాదంలో అతడికి మెడ భాగంలో ఎముక విరిగింది. దాంతో ముషీర్ మూడు నెలలు తనకెంతో ఇష్టమైన ఆటకు దూరం కానున్నాడు. భారత క్రికెట్లో ఈమధ్య కాలంలో ఇది రెండో కారు యాక్సిడెంట్.
రెండేండ్ల క్రితం రిషభ్ పంత్ (Rishabh Pant) రూర్కీ సమీపంలో జరిగిన కారు ప్రమాదం నుంచి మృత్యుంజయుడిలా బయటపడ్డాడు. ఇప్పుడు ముషీర్‌కు కూడా ప్రాణాపాయం తప్పింది. అంతర్జాతీయ కెరీర్ ఘనంగా సాగుతుండగా పంత్.. ఫస్ట్ క్లాస్‌లో మ్యాచ్ విన్నర్‌గా పేరు వస్తున్న క్రమంలో ముషీర్ అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలో వీరోచిత ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించిన పంత్.. ఆ యాక్సిడెంట్ కారణంగా ఏడాదిన్నర పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ 17వ సీజన్‌తో పునరామనం చేసిన డాషింగ్ బ్యాటర్.. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో దుమ్మురేపాడు. తాజాగా చెపాక్ టెస్టులో మెరుపు సెంచరీతో రికార్డులు బద్ధలు కొట్టేశాడు. పంత్ మాదిరిగానే ముషీర్ కూడా త్వరగా కోలుకొని మళ్లీ టాప్ గేర్‌లో ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Mumbai cricketer Musheer Khan, younger brother of Sarfaraz Khan met with an accident yesterday. pic.twitter.com/erLSHguehu
— Devendra Pandey 🦋 (@pdevendra) September 28, 2024
దేశవాళీలో అన్న సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) మాదిరిగానే ముషీర్ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో బౌలర్లను భయపెడుతున్నాడు. రంజీ ట్రోఫీలో, అండర్ -19 వరల్డ్ కప్‌లో సెంచరీలతో చెలరేగిన ముషీర్ ఈమధ్యే దులీప్ ట్రోఫీలోనూ దంచాడు. సీనియర్లు విఫలమైన చోట పట్టువదలని విక్రమార్కుడిలా శతక గర్జనతో ఇండియా ఏను ఆదుకున్నాడు. ఫస్ట్ క్లాస్‌లో రన్ మెషీన్‌గా పేరొందని అతడు ఇరానీ కప్ స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు.
అక్టోబర్ 1న రెస్టాఫ్ ఇండియాతో ముంబై తలపడనుంది. అందుకని స్వగ్రామమైన అజంఘర్ నుంచి తండ్రి నౌషధ్ ఖాన్‌తో కలిసి ముషీర్ తమ ఎస్యూవీ.. టయోటా ఫార్చునర్‌లో లక్నోకు బయల్దేరాడు. అయితే.. లక్నో దరిదాపుల్లో వాళ్ల కారు అదుపుతప్పి రోడ్డు మీది డివైడర్‌ను గట్టిగా ఢీ కొట్టింది. ఆ వెంటనే కారు పల్టీ కొట్టింది. ఈ సంఘటనలో నౌషద్‌కు స్వల్ప గాయాలు కాగా.. ముషీర్ మృత్యుంజయుడిలా బయపటపడ్డాడు.
Breaking News :
Musheer Khan Met With A Massive Accident.
He Was Coming From Azamgarh To Lucknow.
Musheer And His Father Admitted In Hospital.#BANvsIND #INDvBAN #MusheerKhan pic.twitter.com/dk7sLeRqVd
— Cricket Footage (@cricketfootage) September 28, 2024
ప్రస్తుతం అతడు స్పృహలోనే ఉన్నాడని, ఆరోగ్యం నిలకడగానే ఉందని ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే ముషీర్‌ను మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించనున్నారు. ముంబై వచ్చాక బీసీసీఐ వైద్య బృందం అతడిని ప్రత్యేకంగా పరీక్షించనుంది.