అమరావతి : తిరుమలలో శ్రీవారిని సిట్ బృందం చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి శనివారం దర్శించుకున్నారు. విజయవాడ నుంచి బయలు దేరిన ఆయన తిరుపతికి వెళ్లి అక్కడి నుంచి తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సమీపంలో తయారవుతున్న లడ్డూల తయారీని , వాడుతున్న సరుకులను చీఫ్ త్రిపాఠి పరిశీలించారు. ఆయన వెంట సభ్యులు సీతారామారావు, నారాయణ స్వామి తదితరులున్నారు.
సాయంత్రం టీటీడీ ఈవోతో శ్యామలారావును కలిసి వివరాలు తెలుసుకోనున్నారు. తిరుమల లడ్డూ తయారిలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపిస్తూ ఆందోళనను జరుగుతున్న కల్తీ వ్యవహారాన్ని తేల్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దర్యాప్తు కోసం సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.