Duleep Trophy 2024 : క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఓటమి అంచున నిలిచిన జట్టు అనూహ్యంగా గెలుపొందడం.. విజయం తథ్యమనుకున్న జట్టు దారుణ పరాభవం ఎదురవ్వడం చాలా సందర్భాల్లో చూశాం. ఇప్పుడు భారత దేశవాళీ క్రికెట్లోనూ అద్భుతం జరిగింది. ‘ఇండియా బీ'(India B) జట్టు సంచలన విజయం సాధించింది. దులీప్ ట్రోఫీ(Duleep Trophy 2024)లో ‘ఇండియా ఏ’ను చిత్తుగా ఓడించింది. తొలుత ముషీర్ ఖాన్(181) సెంచరీతో కోలుకున్న ఇండియా బీ.. ఆ తర్వాత బౌలర్ల జోరుతో శుభ్‌మన్ గిల్ బృందానికి చెక్ పెట్టింది.
భారీ ఛేదనలో ఇండియా ఏ స్టార్ కేఎల్ రాహుల్(57) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. పేసర్లు యశ్ దయాల్(3/50), ముకేశ్ కుమార్(2/50)లు విజృంభించగా.. ఇండియా ఏ జట్టు 76 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. సూపర్ సెంచరీతో మ్యాచ్‌ను మలపుతిప్పిన ముషీర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
Another intriguing day ends!
India A are off to a steady start at 134/2 in response to India B’s 321.
KL Rahul (23*) and Riyan Parag (27*) are at the crease with India A trailing by 187 runs.#DuleepTrophy | @IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/8GDqDxZ1r4
— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2024
దులీప్ ట్రోఫీలో స్టార్లతో కూడిన ఇండియా బీ జట్టు ఇండియా ఏకు షాకిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా ఏను కట్టడి చేసిన ఇండియా ఏ.. అనంతరం 90/7తో ఆలౌట్ ప్రమాదంలో పడింది. అయితే.. మిడిలార్డర్ బ్యాటర్ ముషీర్ ఖాన్(181) అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. నవ్‌దీప్ సైనీ(56)తో కలిసి 8వ వికెట్‌కు 205 పరుగుల భాగస్వామ్యంతో జట్టు స్కోర్ 300 దాటించాడు.
𝐈𝐧𝐝𝐢𝐚 𝐁 𝐖𝐢𝐧 🙌
Akash Deep’s fighting knock of 43(42) comes to an end as he’s run out by a quick-thinking Musheer Khan.
India B beat India A by 76 runs. A fantastic win 👏#DuleepTrophy | @IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/f3XjnSMrVf
— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2024
Flying Rishabh Pant! ✈️
An excellent catch to dismiss Avesh Khan 👌#DuleepTrophy | @IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/eQyu38DTlt pic.twitter.com/VlTwoWY9o9
— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2024
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్(61), సర్ఫరాజ్ ఖాన్(46)లు చెలరేగినా ఆకాశ్ దీప్(5/56) దెబ్బకొట్టాడు. అతడి ధాటికి ఇండియా బీ 184 పరుగులకే కుప్పకూలింది. సూపర్ బౌలింగ్‌తో ఇండియా ఏను పోటీలోకి తెచ్చాడు. కానీ.. ఛేదనలో కీలక ఆటగాళ్లు మరోసారి చేతులెత్తేశారు. అయితే.. కేఎల్ రాహుల్(57), ఆకాశ్ దీప్(43)లు పోరాడినా కూడా ఇండియా ఏకు ఓటమి తప్పించలేకపోయారు.