Ranji Trophy 2024 : వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రంజీ ఫైనల్లో ముంబై(Mumbai) భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. విదర్భ బౌలర్లను ఉతికారేస్తూ కుర్రాడు ముషీర్ ఖాన్(116 నాటౌట్) సెంచరీతో కదం తొక్కగా.. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన శ్రేయస్ అయ్యర్ (86 నాటౌట్) అర్ధ శతకంతో రాణించాడు. దాంతో ముంబై జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ప్రస్తుతం అంజిక్యా రహానే సేన 429 పరుగుల ఆధిక్యంలో ఉంది. దాంతో, ట్రోఫీపై కన్నేసిన విదర్భ ఆశలు ఆవిరైనట్టే అనిపిస్తోంది.
తొలి ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్(75) హాఫ్ సెంచరీతో ముంబై పరువు కాపాడాడు. అనంతరం ధవల్ కులకర్ణి, శామ్స్ ములానీ విజృంభణతో విదర్భ(Vidarbha) జట్టు 105 పరుగులకే ఆలౌటయ్యింది. దాంతో, ముంబైకి తొలి ఇన్నింగ్స్‌లో 119 పరుగుల ఆధిక్యం లభించింది.
Century for Musheer Khan 💯👏
A gritty knock from the youngster under pressure 💪#RanjiTrophy | @IDFCFIRSTBank | #Final | #MUMvVID
Follow the match ▶️ https://t.co/k7JhkLhOID pic.twitter.com/bnu7C87qZP
— BCCI Domestic (@BCCIdomestic) March 12, 2024
అనంతరం రెండో ఆరంభించిన ముంబైకి ఓపెనర్లు పృథ్వీ షా(11), భూపేన్ లల్వానీ(18) శుభారంభమిచ్చారు. వీళ్లిద్దరూ స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగినా అండర్-19 హీరో ముషీర్ ఖాన్, కెప్టెన్ రహానే(73)లు విదర్భ బౌలర్లను విసిగిస్తూ క్రీజులో పాతుకపోయారు. బౌండరీలు కాకుండా సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మూడో రోజు రహానే ఔటయ్యాక వచ్చిన అయ్యర్ పట్టుదలగా ఆడాడు. హాఫ్ సెంచరీతో ఫామ్ చాటుకొని ముంబైని పటిష్ట స్థితిలో నిలిపాడు.