Butter Chicken Curry | బటర్ చికెన్ టేస్ట్ చేసిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాడు..అసలు ఏమైందంటే..!
Butter Chicken Curry : రెస్టారెంట్ నుంచి బటర్ చికెన్ కొనుగోలు చేసి తినిన వెంటనే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన బ్రిటన్‌లో వెలుగుచూసింది. చికెన్ కర్రీలో ఉన్న నట్స్ అలర్జిక్ రియాక్షన్‌తో 27 ఏండ్ల వ్యక్తి మరణించారు.
Butter Chicken Curry : రెస్టారెంట్ నుంచి బటర్ చికెన్ కొనుగోలు చేసి తినిన వెంటనే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన బ్రిటన్‌లో వెలుగుచూసింది. చికెన్ కర్రీలో ఉన్న నట్స్ అలర్జిక్ రియాక్షన్‌తో 27 ఏండ్ల వ్యక్తి మరణించారు. ఇంటికి వచ్చిన అనంతరం చికెన్ కర్రీ కొద్దిగా తీసుకోగానే కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలాడు. ఇంగ్లండ్‌లోని గ్రేటర్ మాంచెస్టర్ పరిధిలో బురీ ప్రాంతానికి చెందిన జోసెఫ్ హిగ్గిన్సన్ అనఫిలాక్సిక్గా పిలిచే నట్స్, ఆల్మండ్స్ ఎలర్జీతో బాధపడుతుంటారు.
ఇది ప్రాణాంతక అలర్జీ రియాక్షన్. జోసెఫ్ హిగ్గిన్సన్ తీసుకున్న బటర్ చికెన్ లేబుల్‌పై స్పష్టంగా ఇందులో ఆల్మండ్స్ ఉన్నాయని అలర్జీ సమాచారం పొందుపరిచారు. అయితే జోసెఫ్ గతంలో నట్లు ఉన్న డిష్‌లను తీసుకున్నా ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కాలేదని డిజిటల్ న్యూస్ పోర్టల్ మిర్రర్ పేర్కొంది. అయితే బాదం పప్పులతో కూడిన బటర్ చికెన్ కర్రీని కొద్దిగా తీసుకున్న వెంటనే హిగ్గిన్సన్ అలర్జీ రియాక్షన్‌తో ప్రాణాలు కోల్పోయారు.
హిగ్గిన్సన్ అనఫిలాక్సిస్‌తో కన్నుమూశారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనలో టేక్ అవే తప్పిదమేమీ లేదని పోలీసులు నిగ్గుతేల్చారు. ఆయనకు తన అలర్జీల గురించి తెలుసని, ఏదైనా డిష్ తీసుకునే ముందు విధిగా అలర్జీలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటాడని హిగ్గిన్సన్ కుటుంబసభ్యులు తెలిపారు.
Read More :
వంట గ్యాస్ ధర తగ్గింపు రాజకీయ ఎత్తుగడ : మోదీ సర్కార్‌పై భగ్గుమన్న విపక్షం
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Butter Chicken Curry
- Dies
- MAN
- UK
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

