IPL 2025 : బ్యాటర్లకు స్వర్గధామమైన ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక మ్యాచ్‌కు తెరలేవనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ముంబైకి.. రెండే విజయాలతో అట్టడుగున నిలిచిన ఆరెంజ్ ఆర్మీకి ఇది కీలకమైన మ్యాచ్. టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా కమిన్స్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో, మరోసారి సన్‌రైజర్స్ బ్యాటర్లు దంచి కొట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఉప్పల్ మైదానంలో పంజాబ్ కింగ్స్‌పై 245 పరుగులను ఛేదించిన ఆరెంజ్ ఆర్మీ ఈసారి ముంబై విజయయాత్రకు చెక్ పెడుతుందా? లేదా? చూడాలి. ఈ గేమ్ కోసం ముంబై అశ్వనీ కుమార్ బదులు స్పిన్నర్ విఘ్నేశ్ పుతూర్‌ను తీసుకుంది. ఎస్ఆర్హెచ్ కూడా ఓ మార్పు చేసింది. షమీ స్థానంలో జయదేవ్ ఉనాద్కాట్ను తుది జట్టులో ఆడిస్తోంది.
సన్‌రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కాట్, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగ.
ఇంప్యాక్ట్ సబ్స్ : అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, రాహుల్ చాహర్, వియాన్ మల్డర్, షమీ.
📍 Hyderabad @SunRisers 🆚 @mipaltan
Who are you backing tonight? 🤔 #TATAIPL | #SRHvMI pic.twitter.com/m9Y2DIkj1J
— IndianPremierLeague (@IPL) April 23, 2025
ముంబై తుది జట్టు : రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధిర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, విఘ్నేశ్ పుతూర్.
ఇంప్యాక్ట్ సబ్స్ : రోహిత్ శర్మ, కార్బిన్ బాస్చ్, రాజ్ బవ, సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్.