MIW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) చావోరేవో పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ను ఢీకొడుతోంది. రెండే విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన ముంబై ఈ మ్యాచ్ గెలిస్తే రేసులో నిలుస్తుంది. ఒకవేళ బెంగళూరు విజయం సాధిస్తే.. అత్యధిక పాయింట్లతో నేరుగా ఫైనల్ బెర్తు దక్కించుకోనుంది. సో.. ఆర్సీబీ కంటే ముంబైకి ఈ మ్యాచ్ చాలా కీలకం. టాస్ గెలిచిన స్మృతి మంధాన ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
Playing XIs of @RCBTweets and @mipaltan 🙌
Updates ▶️ https://t.co/yUHXkzVIZw #TATAWPL | #KhelEmotionKa | #RCBvMI pic.twitter.com/0cIiVI5y79
— Women’s Premier League (WPL) (@wplt20) January 26, 2026
నాలుగో సీజన్ ఆరంభ పోరులో ముంబైపై ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో గెలుపొందిన ఆర్సీబీ.. ఐదు విజయాలతో నాకౌట్‌కు చేరింది. కానీ, హర్మన్‌ప్రీత్ కౌర్ సేన మాత్రం ఢిల్లీని ఓడించి బోణీ కొట్టినా.. ఆపై చతికిలపడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మెరుపులతో గుజరాత్‌కు షాకిచ్చిన ముంబై రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
ముంబై ఇండియన్స్ తుది జట్టు : సంజీవన సంజన, హీలీ మాథ్యూస్, నాట్‌సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కేర్, రహిలా ఫిర్దౌస్(వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, వైష్ణవీ శర్మ, షబ్నం ఇస్మాయిల్, పూనమ్ ఖెమ్నర్.
ఆర్సీబీ తుది జట్టు : గ్రేస్ హ్యారిస్, స్మృతి మంధాన(కెప్టెన్), జార్జియా వోల్, గౌతమి నాయక్, రీచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, నడినే డీ క్లెర్క్, అరుంధతి రెడ్డి, సయాలీ సత్ఘరే, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్.
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌ను కాపాడుకోవడమే ముంబై ముందున్న కర్తవ్యం. కానీ, గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో కంగుతిన్న ఆర్సీబీ పుంజుకోవాలనే కసితో ఉంది. దాంతో.. మాజీ ఛాంపియన్ల పోరు ఆసక్తి రేపుతోంది. కెప్టెన్, బ్రంట్, అమేలియాపై ఎక్కువగా ఆధారపడుతున్న ముంబై.. మ్యాచ్కొకరు అదరగొడుతున్న బెంగళూరును నిలువరుస్తుందా? లేదా? మరికొన్ని గంటల్లో తెలియనుంది.