WPL | డబ్ల్యూపీఎల్ 2025 ట్రోఫీని ముంబై ఇండియన్స్ ఉమెన్స్ సొంతం చేసుకుంది. బ్రాబౌర్న్‌లో శనివారం రాత్రి జరిగిన ఫైనల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది. 150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌లో మారిజన్సె క్యాప్ 40, జెమ్మీమా రోడ్రిగ్స్ 30, నికీ ప్రసాద్ 25 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు క్రీజ్ ముందు నిలవలేక పోయారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో నాట్ స్కివర్ బ్రంట్ మూడు, అమెలా కేర్ రెండు, షబ్నం ఇస్మాయిల్, హేలీ మ్యాథూస్, సైకా ఇసాకీ చెరో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. సారధి హర్మాన్ ప్రీత్ కౌర్ 66, నాట్ స్కిట్ బ్రంట్ 30 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మారిజన్నె క్యాప్, జెస్ జొన్నాసెన్, శ్రీ చరణి రెండేసి వికెట్లు, అనాబెల్ సూథర్లాండ్ ఒక వికెట్ తీశారు.