IPL 2025 : ఐపీఎల్లో 18వ ఎడిషన్‌లో మరో కీలక మ్యాచ్. పంజాబ్ కింగ్స్‌పై రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) వాంఖడేలో ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను ఢీకొంటోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు. జోరుమీదున్న హైదరాబాద్ టాపార్డర్‌ను నిలువరించాలనే లక్ష్యంతో బౌలింగ్ తీసుకున్నాడు.
ఈ ఎడిషన్‌లో రెండే విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన ఇరుజట్లు విజయంపై కన్నేశాయి. దాంతో, ఉత్కంఠ పోరు అభిమానులను అలరించడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. పంజాబ్‌పై మెరుపు శతకం బాదిన ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి చెలరేగాలని.. హెడ్, క్లాసెన్‌లు విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాలని హైదరాబాద్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
సన్‌రైజర్స్ తుది జట్టు : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, షమీ, ఇషాన్ మలింగ.
ఇంప్యాక్ట్ సబ్స్ : అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనాద్కాట్, సచిన్ బేబీ, రాహుల్ చాహర్, వియాన్ మల్డర్.
🚨 Toss 🚨@mipaltan elected to field against @SunRisers
Updates ▶️ https://t.co/8baZ67XxKu #TATAIPL | #MIvSRH pic.twitter.com/uBcAYXn87a
— IndianPremierLeague (@IPL) April 17, 2025
ముంబై తుది జట్టు : రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధిర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, కరన్ శర్మ.
ఇంప్యాక్ట్ సబ్స్ : రోహిత్ శర్మ, కార్బిన్ బాస్చ్, అశ్వనీ కుమార్, రాజ్ బవ, రాబిన్ మింజ్.
ఇరుజట్లు ఇప్పటివరకూ 23 సార్లు ఎదురుపడ్డాయి. అయితే.. ముంబై 13 విజయాలతో ఆధిపత్యం చెలాయించగా.. సన్‌రైజర్స్ 10 మ్యాచుల్లో గెలుపొందింది. వాంఖడేలో మాత్రం ముంబైదే జోరు. అవును.. ఇక్క ఆడిన 8 మ్యాచుల్లో 6 పర్యాయాలు హైదరాబాద్ చిత్తుగా ఓడింది. 2019 నుంచి గమనిస్తే ఇరుజట్లు 11 సార్లు ఢీకొనగా.. ముంబై 8 మ్యాచుల్లో జయభేరి మోగించింది. 2022 తర్వాత సన్‌రైజర్స్ పుంజుకున్నా సరే.. 3-2తో ముంబై పైచేయి సాధించింది.