బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Nov 06, 2020 , 17:15:57

ముంబై పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌కు గాయం..టోర్నీకి దూరం?

ముంబై పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌కు గాయం..టోర్నీకి దూరం?

దుబాయ్:  ఢిల్లీ క్యాపిటల్స్‌తో గురువారం జరిగిన క్వాలిఫయర్‌-1లో  ముంబై ఇండియన్స్‌  57 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో ఏడాది ఫైనల్‌ చేరింది.  ఐపీఎల్‌లో  ముంబై  ఆరోసారి ఫైనల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. సూపర్‌ విక్టరీతో  ఫైనల్‌కు దూసుకెళ్లిన ముంబైకి ఎదురుదెబ్బ తగిలింది. గజ్జల్లో గాయం కారణంగా పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌  ఫైనల్‌ ఆడతాడో లేదో అనుమానంగా మారింది. బౌల్ట్‌ ఫుల్‌ ఫిట్‌నెస్‌ సాధించి ఫైనల్‌ ఆడతాడని ముంబై కెప్టెన్ రోహిత్‌ శర్మ ‌ చెబుతున్నాడు.   

 14వ ఓవర్‌లో బౌల్ట్‌ మైదానాన్ని వీడాడు.  ఆరంభంలోనే  పృథ్వీ షా, రహానెలను ఔట్‌ చేసిన     బౌల్ట్‌ (2–1–9– 2) గాయంతో తన కోటా పూర్తి చేయలేకపోయాడు.  తన గాయం తీవ్రతపై క్లారిటీ రావాల్సి ఉంది.  గాయం తీవ్రత ఎక్కువైతే కివీస్‌ స్పీడ్‌స్టర్‌ టోర్నీ నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

దుబాయ్‌ వేదికగా నవంబర్‌ 10న ఐపీఎల్‌ ఫైనల్‌ జరుగనుంది. ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడిన బౌల్ట్‌ 22 వికెట్లు తీశాడు. అందులో 14 వికెట్లను పవర్‌ప్లేలోనే పడగొట్టడం విశేషం.  ‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. 'బౌల్ట్‌కు అయిన గాయం తీవ్రమైంది కాదనిపిస్తోంది. బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఫైనల్‌ మ్యాచ్‌కు ఇంకా మూడు రోజుల సమయం ఉంది. తుదిపోరుకు అతడు మైదానంలో అడుగుపెడతాడని' రోహిత్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.