జైపూర్: ముంబై ఇండియన్స్ పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్(Trent Boult).. టీ20 క్రికెట్లో 300 వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆ మైలురాయిని దాటేశాడు. న్యూజిలాండ్‌కు చెందిన బౌల్ట్ కు.. టీ20ల్లో ప్రత్యేక బౌలర్‌గా గుర్తింపు ఉన్నది. పవర్‌ప్లేలో వికెట్ టేకింగ్ మెషీన్‌గా పేరున్నది. ఆర్ఆర్తో మ్యాచ్‌లో అతను 28 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.
ట్రెంట్ బౌల్ట్ ఇప్పటి వరకు 257 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 25.10 సగటుతో అతను 302 వికెట్లు తీసుకున్నాడు. 300 వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్లలో అతను మూడోవాడు. కివీస్ బౌలర్లు టిమ్ సౌథీ 343, ఇష్ సోథీ 310 వికెట్లు తీసుకున్నారు.
ప్రస్తుతం ఐపీఎల్లో బౌల్ట్ టాప్ ఫామ్‌లో ఉన్నాడు. గత 5 మ్యాచుల్లో అతను 11 వికెట్లు తీసుకున్నాడు. పర్పుల్ క్యాప్ రేసులో మూడవ స్థానంలో ఉన్నాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ జట్టు 100 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. ఇక ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ముంబై జట్టు ఏడు విజయాలు, నాలుగు ఓటమిలతో టాప్‌లో ఉన్నది. ఆ జట్టుకు14 పాయింట్ల ఉన్నాయి. ఆర్ఆర్ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నది.