IPL 2026 : ఐపీఎల్ 19వ సీజన్ రీటెన్షన్ గడువు సమీపిస్తోంది. ఆలోపు ఆటగాళ్ల ట్రేడింగ్, వదిలించుకోవాల్సిన క్రికెటర్ల గురించి ఫ్రాంచైజీలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే సంజూ శాంసన్ (Sanju Samson) కోసం చెన్నై సూపర్ కింగ్స్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ సైతం బిగ్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur)ను కొనేందుకు సిద్ధమవుతోంది. అయితే.. పరస్పర బదలాయింపు విధానాన్నేముంబై అనుసరించే అవకాశముంది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఆల్‌రౌండర్ అయిన శార్దూల్‌ను స్వాప్ విధానంలో లేదంటే డబ్బులకైనా తమ గూటికి చేర్చుకోవాలని ముంబై యాజమాన్యం భావిస్తోంది.
ట్రేడ్ పద్దతికి లక్నో అంగీకరిస్తే.. గత సీజన్లో పెద్దగా ఆకట్టుకోని అర్జున్ టెండూల్కర్‌ను లక్నోకు ఇచ్చేయాలని ముంబై అనుకుంటోంది.ఇదే విషయమై లక్నో, ముంబై మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ స్వాప్ డీల్ కుదిరితే సరే.. లేదంటే శార్ధూల్‌ను ఎలాగైనా కొనేందుకు ముంబై ఫిక్స్ అయిందని సమాచారం.
🚨 PEAK IPL TRADE TIME. 🚨
– Arjun Tendulkar could join LSG with Shardul Thakur getting trade to Mumbai Indians. (Cricbuzz). pic.twitter.com/ntNrOOhT81
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 12, 2025
పద్దెనిమిదో సీజన్లో పెద్దగా రాణించని శార్దూల్‌ను వదిలేసుకోవడమే మంచిదని సంజీవ్ గొయెంకా టీమ్ నిర్ణయించుకుంది. అనుభవజ్ఞుడైన ఈ ఆల్‌రౌండర్ సేవల్ని ఉపయోగించుకునేందుకు ముంబై ఆసక్తి చూపించింది. గాయపడిన పేసర్ దీపక్ చాహర్ స్థానాన్ని శార్దూల్‌తో భర్తీ చేయాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం అనుకుంది. దాంతో, ప్రస్తుతం ఇరు ఫ్రాంచైజీల మధ్య చర్చలు నడుస్తున్నాయి. అన్నీ కుదిరితే త్వరలోనే శార్లూల్ ముంబై జెర్సీ వేసుకోవడం ఖాయం. ఐపీఎల్లో ఈ పేస్ ఆల్‌రౌండర్ వేలానికి వెళ్లకుండానే అమ్ముడవ్వడం ఇది మూడోసారి కానుంది. 2017లో కింగ్స్ లెవన్ పంజాబ్ నుంచి అతడిని రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తీసుకుంది. 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ వద్దనుకోవడంతో శార్దూల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది.
MI have reached an in-principle agreement with Lucknow Super Giants to get Shardul Thakur via an all-cash trade deal pic.twitter.com/4Ujb5xhBfE
— ESPNcricinfo (@ESPNcricinfo) November 13, 2025
నిరుడు ఐపీఎల్ మెగా వేలంలో శార్తూల్ ఠాకూర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనలేదు. దాంతో.. అతడు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడాలని డిసైడయ్యాడు. కానీ, లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్ గాయపడడంతో శార్దూల్‌ను అదృష్టం వరించింది. మొహ్సిన్ స్థానంలో ఈ పేసర్‌ను లక్నో రూ.2కోట్ల కనీస ధరకు తీసుకుంది. అయితే.. మెంటార్ జహీర్ ఖాన్ సూచలనతో ఆరంభంలో అదరగొట్టిన శార్దూల్ ఆ తర్వాత ఉసూరుమనిపించాడు. 10 మ్యాచుల్లో 11.02 ఎకానమీతో13 వికెట్లు తీశాడంతే. గత సీజన్లో అర్జున్ సైతం మూడువికెట్లకే పరిమితమయ్యాడు.