Mumbai Indians | పాండ్యాను వదిలేస్తున్న ముంబై.. రాజస్థాన్‌తో డీల్ కుదిరేనా..!
Mumbai Indians : ఐపీఎల్లో మరో భారీ డీల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. సారథిగా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను వదులుకునేందుకు ముంబై ఇండియన్స్(Mumbai Indians) సిద్ధమవుతోంది.
Mumbai Indians : ఐపీఎల్లో మరో భారీ డీల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. సారథిగా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను వదులుకునేందుకు ముంబై ఇండియన్స్(Mumbai Indians) సిద్ధమవుతోంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై పాండ్యా కెప్టెన్సీలో అనామక జట్టుగా మారడంపై ఆగ్రహించిన యాజమాన్యం.. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు అతడిని అప్పగించేందుకు పావులు కదుపుతోంది. బదులుగా రాజస్థాన్ స్టార్ ఆటగాడిని ఇవ్వాల్సిందిగా ముంబై పట్టుపడుతున్నట్టు సమాచారం. „అయితే.. పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ తప్ప.. ఎవరినైనా ట్రేడ్ డీల్ ద్వారా మార్చుకునేందుకు జైపూర్ ఫ్రాంచైజీ ఆసిక్తి కనబరుస్తోంది.
ఈమధ్య ఐపీఎల్ సీజన్ ముగియడమే ఆలస్యం.. కొన్ని జట్లు ఆటగాళ్లను ట్రేడింగ్ పద్ధతిన మార్చుకోవడం చూస్తున్నాం. ఈసారి ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఈ విధానంలో వదిలించుకోవాలని భావిస్తోంది. మూడేళ్ల క్రితం గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తం(దాదాపు రూ.100 కోట్లు)లో పాండ్యాను దక్కించుకున్న ముంబై.. అతడిని వద్దనుకుంటోంది.

గత మూడు సీజన్లలో ముంబై ఆట అధ్వాన్నంగా మారడం.. పాండ్యాపై అంతర్గత వ్యతిరేకత వంటివి ఈ నిర్ణయానికి దారి తీశాయి. మాజీ సారథి రోహిత్ శర్మ కెరీర్ ముగింపు దశలో ఉండడం.. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆటలో మునపటి వేగం తగ్గడం ముంబైని కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో ధనాధన్ ఆటతో శుభారంభాలు ఇవ్వగల యశస్వీ లాంటి ఓపెనర్ అవసరం ముంబైకి ఏర్పడింది.
Mumbai Indians are reportedly in advanced talks with Rajasthan Royals for a blockbuster swap: Hardik Pandya for Yashasvi Jaiswal. Plus, major updates on the futures of Suryakumar Yadav and Rohit Sharma as MI looks toward a new era. #IPL2027 https://t.co/WDxBvANe2Z
— Circle of Cricket (@circleofcricket) June 22, 2026
రెవ్‌స్పోర్ట్స్ కథనం ప్రకారం.. ఈ పేస్ ఆల్‌రౌండర్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చేసి.. ఆ జట్టులోని స్టార్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ను ముంబై కోరుతోంది. రంజీల్లో ముంబైకి ఆడుతున్న యశస్వీని ఎలాగైనా తమ జెర్సీతో ఆడించాలని ముంబై అనుకుంటోంది. దాంతో.. పాండ్యా, యశస్వీని పరస్పరం మార్చుకోవడంపై ఇరు ఫ్రాంచైజీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

అయితే.. అందుకు రాజస్థాన్ ఇంకా పచ్చజెండా ఊపలేదు. ఎందుకంటే.. సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ గూటికి చేరాక.. రాజస్థాన్‌లో యశస్వీనే స్టార్ ప్లేయర్‌గా మారాడు. కానీ వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఆటతో అతడికి పోటీ ఇస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఫ్రాంచైజీ మారేందుకు యశస్వీ ఆలోచిస్తున్నాడని టాక్. త్వరలోనే ముంబై, రాజస్థాన్ మధ్య ట్రేడ్ డీల్ ఖరారయ్యే అవకాశముందని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

