ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా అరుణ్‌జైట్లీ స్టేడియంలో మరికాసేపట్లో ఆసక్తికర పోరు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. వరుసగా విఫలమవుతున్న ఇషాన్ కిషన్ స్థానంలో నాథన్ కౌల్టర్ నైల్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు రోహిత్ చెప్పాడు.
ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ముంబై జట్టు కేవలం రెండింటిలో మాత్రమే గెలుపొందగా..
రాజస్థాన్ కూడా రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై తన చివరి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచిన రాజస్థాన్ మళ్లీ పుంజుకుంది. వరుస ఓటములతో ఇబ్బందిపడుతున్న రోహిత్‌సేన ఢిల్లీలో మళ్లీ గెలుపు బాటపట్టాలని చూస్తోంది.
Match 24. Mumbai Indians XI: Q de Kock, R Sharma, S Yadav, K Pollard, H Pandya, K Pandya, J Yadav, N Coulter-Nile, R Chahar, J Bumrah, T Boult https://t.co/iO745uIzOg #MIvRR #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 29, 2021
Match 24. Rajasthan Royals XI: Y Jaiswal, J Buttler, S Samson, S Dube, D Miller, R Parag, R Tewatia, C Morris, J Unadkat, C Sakariya, M Rahman https://t.co/iO745uIzOg #MIvRR #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 29, 2021