IPL 2026 : ఐపీఎల్ 19వ సీజన్ వేలానికి ముందే స్టార్ ఆల్‌రౌండర్‌ను ముంబై ఇండియన్స్ (Mumbai Indins) కొనేసింది. రీటెన్షన్ గడువు సమీపిస్తున్న వేళ బిగ్ ప్లేయర్ అయిన శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur)ను కొనేసింది ముంబై. పరస్పర బదలాయింపు విధానంలో లేదా ట్రేడ్ డీల్ ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ (Luckonw Super Giants) నుంచి శార్దూల్‌ను తీసుకునేందుకు ఇరు ఫ్రాంచైజీల మధ్య చర్చలు జరిగాయి. చివరకు రూ.2 కోట్లకు లార్డ్స్ హీరోను తమ గూటికి చేర్చుకుంది ముంబై. దాంతో.. ట్రేడ్ పద్దతిన పేస్ అల్రౌండర్ అర్జున్ టెండూల్కర్‌ను ముంబై వదులుకోనుందనే వార్తలకు చెక్ పడింది.
శార్దూల్‌ను కొన్న విషయాన్ని ముంబై ఎక్స్ వేదికగా వెల్లడించింది. కలల సిటీ అయిన ముంబై, మా ఇల్లుకు స్వాగతం అని పోస్ట్ పెట్టింది ముంబై. ఐపీఎల్లో మరో ప్లేయర్కులేని రికార్డు శార్ధూల్ ఠాకూర్‌కు ఉంది. ఈ పేస్ ఆల్‌రౌండర్ ఇప్పటివరకూ మూడు సార్లు వేలానికి వెళ్లకుండానే అమ్ముడయ్యాడు. 2017లో కింగ్స్ లెవన్ పంజాబ్ నుంచి అతడిని రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తీసుకుంది. 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ వద్దనుకోవడంతో శార్దూల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు లక్నో నుంచి రూ.2 కోట్లకు ముంబై అతడిని కొనుగోలు చేసింది.
पुढील स्टेशन: 𝗚𝗛𝗔𝗥 🏠🥹
Shardul, welcome to the city of dreams – our home 💙✨ pic.twitter.com/z8lBDyA0jq
— Mumbai Indians (@mipaltan) November 13, 2025
ముంబై ప్రధాన పేసర్ దీపక్ చాహర్ గాయపడిన విషయం తెలిసిందే. అతడి స్థానాన్ని శార్దూల్ భర్తీ చేయనున్నాడు. ఐపీఎల్లో శార్ధూల్ ప్రాతినిధ్యం వహించనున్న ఏడో ఫ్రాంచైజీ కానుంది ముంబై. ఇప్పటివరకూ పంజాబ్ కింగ్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు ఆడాడీ క్రికెటర్..
నిరుడు ఐపీఎల్ మెగా వేలంలో శార్తూల్ ఠాకూర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనలేదు. దాంతో.. అతడు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడాలని డిసైడయ్యాడు. కానీ, లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్ (Mohsin Khan) గాయపడడంతో శార్దూల్‌ను అదృష్టం వరించింది. మొహ్సిన్ స్థానంలో ఈ పేసర్‌ను లక్నో రూ.2కోట్ల కనీస ధరకు తీసుకుంది. అయితే.. మెంటార్ జహీర్ ఖాన్ సూచలనతో ఆరంభంలో అదరగొట్టిన శార్దూల్ ఆ తర్వాత ఉసూరుమనిపించాడు. 10 మ్యాచుల్లో 11.02 ఎకానమీతో13 వికెట్లు తీశాడంతే.
📰 𝗦𝗛𝗔𝗥𝗗𝗨𝗟 𝗧𝗛𝗔𝗞𝗨𝗥 𝗝𝗢𝗜𝗡𝗦 𝗠𝗨𝗠𝗕𝗔𝗜 𝗜𝗡𝗗𝗜𝗔𝗡𝗦 𝗔𝗛𝗘𝗔𝗗 𝗢𝗙 𝗜𝗣𝗟 𝟮𝟬𝟮𝟲
Read more 👉 https://t.co/bwcjR4dDQs pic.twitter.com/NjvmKRA3NZ
— Mumbai Indians (@mipaltan) November 13, 2025