Ranji Trophy 2024 | దేశవాళీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీలో ముంబై మరోసారి ఛాంపియన్ ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. లీగ్ స్టేజ్‌తో పాటు క్వార్టర్స్‌లో నిలకడగా ఆడిన తమిళనాడు సెమీస్‌లోనే నిష్క్రమించింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో తమిళనాడును బ్యాటింగ్ నిండా ముంచింది. తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌట్ అయిన సాయికిషోర్ నేతృత్వంలోని తమిళనాడు.. ముంబైకి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 378 రన్స్ సమర్పించింది. దీంతో ఆ జట్టు 232 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది. ఈ క్రమంలో తమిళనాడు.. 162 పరుగులకే చిత్తై 70 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది.
ఆట రెండో రోజు ముంబై ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ సెంచరీ (109)కి తోడు తనుష్ కొటియాన్ (89) రాణించడంతో ముంబై 378 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన తమిళనాడును శార్దూల్, అవస్తి, ములాని ఆటాడుకున్నారు. మూడో ఓవర్లోనే తమిళ ఓపెనర్ జగదీషన్‌ను ఠాకూర్ డకౌట్ చేశాడు. తన మరుసటి ఓవర్లో ఠాకూర్.. సాయి సుదర్శన్ (5) ను పెవిలియన్‌కు పంపాడు.
ఆ తర్వాత అవస్తి, కొటియాన్‌లు తమిళనాడు పనిపట్టారు. బాబా ఇంద్రజిత్ (70) ఒక్కడే నిలబడ్డాడు. విజయ్ శంకర్ (24)తో పాటు కెప్టెన్ సాయి కిషోర్ (21) లు విఫలమయ్యారు. తమిళనాడు ఆఖరి వరుస బ్యాటర్లను ములాని దెబ్బతీశాడు. చివరి నాలుగు వికెట్లు అతడి ఖాతాలోకే వెళ్లాయి.
𝐌𝐮𝐦𝐛𝐚𝐢 𝐜𝐫𝐮𝐢𝐬𝐞 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐧𝐚𝐥! 👏
A superb performance from the @ajinkyarahane88-led side as they beat Tamil Nadu by an innings and 70 runs in Semi Final 2 of the @IDFCFIRSTBank #RanjiTrophy 🙌#MUMvTN | #SF2
Scorecard ▶️ https://t.co/9tosMLk9TT pic.twitter.com/bOikVOmBn1
— BCCI Domestic (@BCCIdomestic) March 4, 2024
రంజీలలో ముంబైకి ఇది 48వ ఫైనల్ కావడం గమనార్హం. ఇందులో ఆ జట్టు ఏకంగా 41 సార్లు ట్రోఫీ నెగ్గింది. ఇక ఫైనల్లో భాగంగా ప్రస్తుతం విదర్భ – మధ్యప్రదేశ్ మధ్య జరుగుతున్న తొలి సెమీస్‌లో విజేతతో ఆ జట్టు తుదిపోరు ఆడనుంది.