Nat Sciver Brunt : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ నాట్‌సీవర్ బ్రంట్ (Nat Sciver Brunt) చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీల్లో మొట్టమొదటి శతకంతో బ్రంట్ రికార్డు నెలకొల్పింది. చావోరేవో పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లపై బౌండరీల మోతతో విరుచుకుపడిన ఆమె.. సెంచరీతో భారీ స్కోర్ అందించింది. తనమార్క్ విధ్వంసంతో ఆర్సీబీకి చుక్కలు చూపించిన తను.. 19వ ఓవర్లో సింగిల్ తీసి వంద పూర్తి చేసుకుంది.
టీ20ల్లో దూకుడైన ఆటతో చెలరేగే నాట్ సీవర్ బ్రంట్ ఈసారి మహిళల ప్రీమియర్ లీగ్‌లో రెచ్చిపోయింది. గత మూడు సీజన్లుగా ముంబై విజయాల్లో కీలకమవుతున్న ఆమె గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో శతకంతో గర్జించింది. తద్వారా ఈ లీగ్ చరిత్రలో మూడంకెల స్కోర్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డు పుస్తకాల్లో చేరింది.
Three seasons later, it’s NAT SCIVER-BRUNT who breaks the curse! 🔥
She becomes the first-ever centurion in the TATA WPL. What an innings! 💙#TATAWPL #RCBvMI 👉 LIVE NOW ➡️ https://t.co/OekUFz7X3e pic.twitter.com/92k7bcDQmU
— Star Sports (@StarSportsIndia) January 26, 2026
ఇప్పటివరకూ జార్జియా వోల్(యూపీ వారియర్స్ తరఫున) 99 నాటౌట్ అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండేది. కానీ.. బ్రంట్ 59 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా నిలిచి ముంబైకి భారీ స్కోర్ కట్టబెట్టింది. తన శతకాన్ని భాగస్వామి క్యాథరీన్ సీవర్ బ్రంట్, కుమారుడికి అంకితం చేసిందీ ఇంగ్లండ్ స్టార్.
100 నాటౌట్ – నాట్‌సీవర్ బ్రంట్(ముంబై ఇండియన్స్) vs ఆర్సీబీ, వడోదర 2026,
99 నాటౌట్ – జార్జియా వోల్(యూపీ వారియర్స్) vs ఆర్సీబీ, లక్నో 2025
99 – సోఫీ డెవినె (ఆర్సీబీ) vs గుజరాత్, బ్రబొర్నే 2023
96 నాటౌట్ – అలీసా హీలీ(యూపీ వారియర్స్) vs ఆర్సీబీ, బ్రబొర్నే 2023
96 నాటౌట్ – బేత్ మూనీ (గుజరాత్ జెయింట్స్) vs యూపీ వారియర్స్, లక్నో 2025
96 – స్మృతి మంధాన (ఆర్సీబీ) vs ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై డీవై పాటిల్ స్టేడియం – 2026