IND vs WI: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య వందో టెస్టు మొదలైంది. ట్రినిడాడ్ క్వీన్స్ పార్క ఓవల్(Queen’s Park Oval) వేదికగా జరుగుతున్నఈ టెస్టులో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్ (Kraigg Brathwaite) బౌలింగ్ తీసుకున్నాడు. పిచ్ స్లోగా ఉంటుందనే ఉద్దేశంతో భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఇది 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ స్టార్ ముకేశ్ కుమార్(Mukesh Kumar) టెస్టుల్లో ఆరంగేట్రం చేయనున్నాడు. విండీస్ తరఫున కిర్క్ మెకెంజీ(Kirk McKenzie)కి కూడా ఇదే మొదటి మ్యాచ్. 7ః30కి మ్యాచ్ మొదలవ్వనుంది. ఇరుజట్ల తుది జట్టు వివరాలివి..
భారత జట్టు : యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, జయదేవ్ ఉనాద్కాట్, ముకేశ్ కుమార్, సిరాజ్.
వెస్టిండీస్ జట్టు : క్రెగ్ బ్రాత్‌వైట్(కెప్టెన్), తంగనరైన్ చందర్‌పాల్, కిర్క్ మెకంజీ, జెర్మేన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథనజే, జోషువా డ సిల్వా(వికెట్ కీపర్), జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్, జొమెల్ వార్రికన్, షనాన్ గాబ్రియెల్.
దేశవాళీలో బెంగాల్ బౌలర్ ముకేశ్ కుమార్ సత్తా చాటాడు. దాంతో, పదహారో సీజన్మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) అతడిని రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసీజన్లో ముకేశ్ అద్భుత ప్రదర్శన చేసిన అతను 7 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ 16వ సీజన్లో ముకేశ్
అయితే.. ఆరంభం నుంచి దారుణంగా ఆడిన ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. ఓపెనర్ పృథ్వీ షా(Prithvi Shaw), మనీశ్ పాండే, మిచెల్(Mitchell Marsh) మార్ష్ వంటి కీలక ఆటగాళ్లు విఫలం కావడంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.