Muhammad Imran : ఫాస్ట్ బౌలలర్లు ఎందురున్నా షోయబ్ అక్తర్ (Shoaib Akhtar)పేరు వింటే ఒకప్పుడు బ్యాటర్లు వెన్నులో వణుకు పుట్టేది. బుల్లెట్ వేగంతో అతడు సంధించే బంతుల్ని ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి ఆటగాళ్లు నానా తంటాలు పడేవారు. అతడి బౌలింగ్ యాక్షన్ చూస్తూనే కంగారెత్తిపోయేవారు చాలామంది. ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’గా పేరొందిన అక్తర్ వీడ్కోలు పలకడంతో ‘హమ్మయ్య బతికిపోయాం’ అనకున్నారు క్రికెటర్లు. కానీ, ఇప్పుడు అచ్చం అతడి బౌలింగ్ స్టయిల్‌తో నెట్టింట వైరలవుతున్నాడు ఒమన్ బౌలర్ ముహమ్మద్ ఇమ్రాన్ (Muhammad Imran). నిజానికి అతడు మొదట్లో పేసర్ అవ్వాలనుకోలేదు. కానీ,
తొలిసారి ఆసియా కప్ పోటీలకు అర్హత సాధించిన ఒమన్ మంగళవారం స్క్వాడ్‌ను ప్రకటించింది. ఈ మెగా టోర్నీకోసం ఎంపిక చేసిన 17మందిలో పేస్ సంచలనం ముహమ్మద్ ఇమ్రాన్ ఒకడు. తన బౌలింగ్ స్టయిల్‌తో ‘జూనియర్ షోయబ్ అక్తర్’గా పేరొందిన ఇమ్రాన్ ఆసియా కప్‌లో బ్యాటర్లను బెంబేలెత్తించేందుకు సిద్ధమవుతున్నాడు. భారత్, శ్రీలంక.. వంటి మేటిజట్ల బ్యాటర్లకు సవాల్ విసురుతానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడీ పేస్‌గన్.
He’s more Shoaib Akhtar than Shoaib Akhtar himself… pic.twitter.com/cXKQGgNgbn
— Prashanth (@ps_it_is) September 19, 2024
ప్రపంచ టెస్టు క్రికెట్లో షోయబ్ అక్తర్ పేరు ఓ సంచలనం. తన సూపర్ ఫాస్ట్ బౌలింగ్‌తో బ్యాటర్లకు దడ పుట్టించేవాడీ పాక్ పేసర్. అతడి బౌలింగ్ స్టయిల్‌ను కాపీ కొట్టేందుకు చాలామందే ప్రయత్నించారు. కానీ, విజయవంతమైంది మాత్రం ఒమన్ పేసర్ ఇమ్రాన్ మాత్రమేనని చెప్పచ్చు. గంటకు 143 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధిస్తూ.. అక్తర్‌ను తలపించే బౌలింగ్‌తో వార్తల్లో నిలుస్తున్న ఈ పేసర్ స్వదేశం అఫ్గనిస్థాన్. అతడికి 18 ఏళ్లు ఉన్నప్పుడు సైన్యంలో చేరాలని కుటుంబం ఒత్తిడి చేసింది. దాంతో.. చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి పారిపోయాడు ఇమ్రాన్.
మూడురోజులు ట్రక్కులో ప్రయాణించి కరాచీ చేరుకున్నాడు. అక్కడ అతడి బౌలింగ్ నైపుణ్యాన్ని గుర్తించిన కరాచీ క్రికెట్ సంఘం అండర్ -19 జట్టులో అవకాశం కల్పించింది. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఇమ్రాన్ ఆరు మ్యాచుల్లో 21 వికెట్లతో రాణించాడు. దాంతో, అతడి ప్రతిభకు పాక్ లెజెండ్ వసీం అక్రమ్ సైతం ఫిదా అయ్యాడు. కానీ, పాక్ క్రికెట్లోని రాజకీయాల కారణంగా ఇమ్రాన్ కెరీర్లో ముందుకెళ్లలేకపోయాడు.
పేస్ బౌలర్‌గా ఎదగాలనకున్న ఇమ్రాన్ జీవితం అనుకోకుండా 2019లో టర్నింగ్ పాయింట్ అయింది. అతడి స్నేహితుడు ఇమ్రారన్ బౌలింగ్ వీడియోను యూట్యూబ్‌లో పెట్టడమే అందుకు కారణం. ఆ వీడియో చూసిన ఒమన్ సెలెక్టర్లు ఇమ్రాన్‌కు అండగా నిలిచి జట్టులోకి తీసుకున్నారు. నిరుడు ఒమన్‌లో జరిగిన డీ10 లీగ్‌లో ఈ కుడిచేతి వాటం పేసర్ అత్యుత్తమ ప్రదర్శనతో ఔరా అనిపించాడు. 14 మ్యాచుల్లో 8.65 సగటుతో 21 వికెట్లతో చెలరేగాడు.