MS Dhoni | ఐపీఎల్ 2024 కోసం గత రెండు నెలలుగా విరామం లేకుండా బిజీబిజీగా గడిపిన భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ప్రస్తుతం రిలాక్స్ అవుతున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ప్లే ఆఫ్స్ చేరకపోవడంతో ధోనీ తన సొంతూరు రాంచీకి వెళ్లిపోయాడు. అక్కడ కుటుంబంతో కలిసి తన విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే బైక్పై రాంచీ వీధుల్లో (Ranchi Roads) చక్కర్లు కొడుతూ కనిపించాడు. హెల్మెట్ ధరించి యమయా బైక్పై రాంచీ రోడ్లపై షికారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
కాగా, మే 19న చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో సీఎస్కే 27 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో సీఎస్కే జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Thala Dhoni back to his routine life! 🥰❤️@MSDhoni #MSDhoni #WhistlePodu pic.twitter.com/Yow2so0RXe
— DHONI Era™ 🤩 (@TheDhoniEra) May 20, 2024
Also Read..
Flamingos | విమానం ఢీకొని 36 ఫ్లెమింగోలు మృతి
Anand Mahindra | 2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్ ఫొటో : ఆనంద్ మహీంద్రా