Anand Mahindra | 2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్ ఫొటో : ఆనంద్ మహీంద్రా
Anand Mahindra | కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) మరో ఫొటోతో నెటిజన్ల ముందుకొచ్చారు. 2024 ఎన్నికల్లో (2024 Elections) ఇదే బెస్ట్ ఫొటో (Best Picture) అంటూ పోస్టు పెట్టారు.
Anand Mahindra | కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తనకు నచ్చిన అంశాలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. స్ఫూర్తిదాయక, వినోదాత్మక పోస్ట్‌లు, ఫొటోలు, వీడియోలను అభిమానులతో షేర్ చేస్తుంటారు. తాజాగా మరో ఫొటోతో నెటిజన్ల ముందుకొచ్చారు. 2024 ఎన్నికల్లో (2024 Elections) ఇదే బెస్ట్ ఫొటో (Best Picture) అంటూ పోస్టు పెట్టారు.
గ్రేట్ నికోబార్ (Great Nicobar) ద్వీపంలోని దట్టమైన అడవుల్లో నివసించే షోంపెన్ తెగకు (Shompen tribe) చెందిన ఏడుగురిలో ఒకరు మొదటిసారి ఓటేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మహీంద్రా షేర్ చేస్తూ.. ప్రజాస్వామ్యానికి ఎదురులేని, తిరుగులేని శక్తి అంటూ కొనియాడారు. ‘2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్ ఫొటో. గ్రేట్ నికోబార్‌లోని షోంపెన్ తెగకు చెందిన ఏడుగురిలో ఒకరు మొదటిసారి ఓటు వేశారు. ఇది ప్రజాస్వామ్యానికి ఎదురులేని, తిరుగులేని శక్తి’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం మహీంద్రా షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘పిక్చర్ ఆఫ్ ది డే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
This, for me, is the best picture of the 2024 elections.
One of seven of the Shompen tribe in Great Nicobar, who voted for the first time.
Democracy: it’s an irresistible, unstoppable force. pic.twitter.com/xzivKCKZ6h
— anand mahindra (@anandmahindra) May 20, 2024
Also Read..
PM Modi | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మోదీ నివాళులు
Jake Fraser-McGurk: ఆస్ట్రేలియా రిజర్వ్ ప్లేయర్ల లిస్టులో జేక్ ఫ్రేజర్‌కు చోటు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

