సిడ్నీ: అమెరికాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ టోర్నీ కోసం ఆస్ట్రేలియా తన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా 15 మంది ఆటగాళ్లతో పాటు రిజర్వ్ ప్లేయర్ల పేర్లను ప్రకటించారు. అయితే ఐపీఎల్లో సంచలనం రేపిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(Jake Fraser-McGurk) బ్యాటర్‌ను రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో చోటు కల్పించారు. మాట్ షార్ట్ కూడా రిజర్వ్ జాబితాలో ఉన్నాడు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ఆసీస్ బృందంలో చోటు దక్కలేదు.
ఆసీస్ కెప్టెన్సీ బాధ్యతలను మిచెల్ మార్ష్ చేపట్టనున్నాడు. లెగ్ స్పిన్నర్ ఆస్టన్ ఆగర్‌కు వరల్డ్‌కప్ జట్టులో స్థానం కల్పించారు. ఆల్‌రౌండర్ల జాబితాలో మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉన్నారు.
ఫ్రేజర్, షార్ట్‌లను తప్పని పరిస్థితుల్లో ఎంపిక చేయాల్సి వస్తోందని ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపారు. జూన్ 5వ తేదీన ఒమన్‌తో ఆసీస్ తొలి మ్యాచ్ఆ డనున్నది. ఆ తర్వాత ఇంగ్లండ్, నమీబియా, స్కాట్లాండ్ జట్లుతో గ్రూపు బి మ్యాచ్‌లు ఆడుతుంది.
ఆసీస్ జట్టు: మిచెల్ మార్ష్, ఆస్టన్ అఘర్, ప్యాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలిస్, కెమరూన్ గ్రీన్, జోష్ హేజల్‌వుడ్, ట్రావిడ్ హెడ్, జోష్ ఇంగ్లిష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచ్చల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
రిజర్వ్ లిస్టు: జేక్ ఫ్రేజర్ మెక్గుర్, మాట్ షార్ట్