Flamingos | ఎమిరేట్స్ విమానం (Emirates Flight) ఢీ కొని సుమారు 36 ఫ్లెమింగోలు (Flamingos) మరణించాయి. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai )లోని ఘట్కోపర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 9:18 గంటల సమయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఎమిరేట్స్ ఈకే 508 విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ముందు పక్షులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 36 ఫ్లెమింగోలు మరణించారు. ఘట్కోపర్ పరిసర ప్రాంతాల్లో ఫ్లెమింగో కళేబరాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో విమానం కూడా కొంతమేర దెబ్బతిన్నట్లు తెలిపారు. ఘటన నేపథ్యంలో రిటర్న్ ఫ్లైట్‌ను అధికారులు రద్దు చేశారు.
మరోవైపు అటవీ శాఖ అధికారులు ఘట్కోపర్ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న పక్షుల అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు కళేబరాలను శవపరీక్ష కోసం పంపినట్లు రెస్కింక్ అసోసియేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ వ్యవస్థాపకుడు పవన్ శర్మ తెలిపారు.
Also Read..
Anand Mahindra | 2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్ ఫొటో : ఆనంద్ మహీంద్రా
Live-In Partner | ప్యాన్‌తో కొట్టి.. సహజీవన భాగస్వామిని చంపిన మహిళ