గురుగ్రామ్: హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకున్నది. తనకంటే చిన్నవయస్కుడితో సహజీవనం చేస్తున్న (Live-In Partner) ఓ మహిళ అతడిని ప్యాన్‌తో కొట్టి చంపేసింది. గురుగ్రామ్‌లోని అశోక్ విహార్‌కు చెందిన నీతూ అనే 34 ఏండ్ల వివాహిత.. తన కంటే ఆరేండ్లు చిన్నవాడైన విక్కీ అనే యువకుడితో గత ఆరు సంవత్సరాలుగా కలిసి ఉంటుంది. ఆమెకు 15 ఏండ్ల వయస్సున్న ఒక కొడుకు కూడా ఉన్నాడు.
కాగా, గత శుక్రవారం రాత్రి గురుగ్రామ్‌కు సమీపంలోని టిక్రీ గ్రామానికి విక్కీని తీసుకెళ్లిన నీతూ.. తన సోదరుడితో కలిసి అతని తల, మెడపై ప్యాన్‌తో కొట్టి హత్యచేసింది. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. అయితే విక్కీ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నీతూ, ఆమె సోదరుడు కలిసి విక్కీని చంపినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో అమెను అరెస్టు రిమాండ్‌కు తరలించారు.