MS Dhoni | పార్టీలో హార్దిక్ పాండ్యా, ర్యాపర్ బాద్షాతో స్టెప్పులేసిన ధోని.. వైరల్ అవుతున్న వీడియో
క్లోజ్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో ర్యాపర్ బాద్షాతో కలిసి పాటలు పాడిన ధోని
MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ దుబాయ్‌లో ఫ్యామిలీ టైంను ఎంజాయ్ చేస్తున్నాడు. ధోనీ అక్కడి పబ్‌లో జరిగిన ఒక పార్టీలో పాటలు పాడుతూ, డాన్స్ చేస్తున్న వీడియో బయటికి వచ్చింది. అతనితో పాటు భారత జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ఓపెనర్ ఇషాన్ కిషన్, ర్యాపర్ బాద్షా, మరికొంతమంది స్నేహితులు ఉన్నారు. దుబాయ్‌లో ఈమధ్యే ధోని క్లోజ్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ జరిగింది. ఈ సందర్భంగా ధోని కొంచెం సేపు డీజే ఆపరేటర్‌గా అవతారమెత్తాడు. అంతేకాదు హిందీ ర్యాపర్ బాద్షాతో కలిసి పాటలు కూడా పాడాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అతని భార్య సాక్షి సింగ్ కూడా కనిపించింది. న్యూజిలాండ్‌తో 3 టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యా, ఓపెనర్ ఇషాన్ కిషన్ వన్డే సిరీస్‌కు ఎంపిక కాలేదు.
త్వరలోనే 2023 ఐపీఎల్ ప్రారంభం కానుంది. చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్‌గా ధోని మరోసారి బరిలోకి దిగనున్నాడు. అతని సారథ్యంలో సీఎస్కే నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఈ సీజన్లో హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటన్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా టోర్నీలో అడుగుపెట్టనుంది. పోయిన ఏడాది ఐపీఎల్ గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది.
Ms Dhoni, Hardik Pandya and Badshah partying in Dubai 🎉🔥pic.twitter.com/Ww2pLoa9cF
— Cricket🏏 Lover (@CricCrazyV) November 27, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

